ముంతాజ్చా.. లా చిత్రాల్లో ఆమె అప్పట్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంలో గెస్ట్ రోల్ తో పాటు గ్లామరస్ సాంగ్ లో మెరిసింది. తమిళ చిత్రాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. బోల్డ్ గా కనిపిస్తూ యువతలో బాగా పాపులర్ అయింది. ఖుషి తర్వాత చాలా ఏళ్ళకి మరోసారి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. మహేష్ బాబు ఆగడు చిత్రంలో కూడా నటించింది. చివరగా ఆమె టామీ అనే చిత్రంలో మెరిసింది.
అయితే చాలా చిత్రాల్లో ఆమె అప్పట్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంలో గెస్ట్ రోల్ తో పాటు గ్లామరస్ సాంగ్ లో మెరిసింది. తమిళ చిత్రాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. బోల్డ్ గా కనిపిస్తూ యువతలో బాగా పాపులర్ అయింది. ఖుషి తర్వాత చాలా ఏళ్ళకి మరోసారి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. మహేష్ బాబు ఆగడు చిత్రంలో కూడా నటించింది. చివరగా ఆమె టామీ అనే చిత్రంలో మెరిసింది. ‘నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను.
నాకు ఖురాన్ బాగా తెలుసు. మొదట్లో ఖురాన్‌లో పేర్కొన్న విషయాలను అర్థం చేసుకోలేకపోయాను. అయితే ఒకానొక దశలో దాని అంతరార్థం నాకు అర్థమై నాలో మార్పు వచ్చింది. అందుకే సినిమాలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను’ ‘గతంలో నేను చాలా గ్లామరస్‌గా నటించాను. అందుకే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.
నా బోల్డ్ అండ్ గ్లామరస్ ఫొటోలను సామాజిక మధ్యమాల నుంచి తొలగించాలని అనుకుంటున్నాను. కానీ ఆ పని నాకు సాధ్యం కావడం లేదు. అభిమానులు సాధ్యమైనంత వరకూ నా గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దు’ అని దీనంగా వేడుకుంటోంది ముంతాజ్. ప్రస్తుతం ఈ నటి ఫొటోలు సామాజి మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ షాక్ అవుతున్నారు.