మీ లోన్ EMI కడుతున్నారా..? ఈ చిన్న పని చేస్తే చాలు, మీ EMIకి కట్టే డబ్బులు ఖచ్చితంగా తగ్గుతుంది.

divyaamedia@gmail.com
3 Min Read

ఈఎంఐ చెల్లించడం మిస్ అయితే అది మీ క్రెడిట్ స్కోర్ పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ క్రెడిట్ రిపోర్టు అనేది మీ పాత అప్పులు, తీసుకున్న లోన్ల తిరిగి చెల్లింపులు, క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపులు, మీ రాబడులు, ఖర్చుల ఆధారంగా రూపొందుతుంది. ఈఎంఐ చెల్లింపులు సక్రమంగా లేకపోతే ఈ సిబిల్ స్కోర్ తగ్గిపోతోంది. అయితే మీ సర్వీస్‌లను విస్తరించడానికి మీ దగ్గర డబ్బు లేకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ బ్యాంక్‌కు వెళ్లినా మీకు వృత్తిపరమైన రుణం సులభంగా లభిస్తుంది. బ్యాంక్‌లు కాకుండా ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఈ లోన్‌ ఫెసిలిటీని అందిస్తున్నాయి.

వ్యక్తిగత రుణం తరహాలో ప్రొఫెషనల్‌ లోన్ ఖర్చు చేయడంలో మీకు పూర్తి స్వేచ్ఛ & సౌలభ్యం ఉంటుంది. అంటే, మీరు మీ డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలి అనే దానిపై రుణదాత ఎటువంటి పరిమితులు విధించదు, మీరు నెలవారీ కిస్తీ సక్రమంగా చెల్లిస్తే చాలని భావిస్తుంది. అయితే, లోన్‌ EMI ఎక్కువగా ఉంటే, అది మీ ఆందోళనను పెంచుతుంది, మిమ్మల్ని నిద్రపోనివ్వదు. కొన్ని ప్రత్యేక వ్యూహాలను అనుసరించడం ద్వారా మీరు మీ EMI భారాన్ని తగ్గించుకోవచ్చు. బ్యాంక్‌ లోన్‌ EMIని తగ్గించుకునే ఉపాయాలు:- అధిక క్రెడిట్‌ స్కోర్‌..రుణదాతమీ రుణంపై వడ్డీ రేటును నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది.

సాధారణంగా, బ్యాంక్‌ లేదా ఏదైనా ఆర్థిక సంస్థ రుణగ్రహీత సిబిల్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. అందువల్ల, మీ క్రెడిట్ స్కోర్‌ ఎప్పుడూ తగ్గకుండా, అదే సమయంలో ఎక్కువగా ఉండేలా ఉంచుకోండి. దీనికోసం.. మీరు ఇప్పటికే తీసుకున్న అన్ని రుణాల EMIలను సకాలంలో చెల్లించండి. మీ క్రెడిట్ కార్డ్‌లను అతిగా ఉపయోగించడం మానుకోండి. మీ క్రెడిట్‌ కార్డ్‌ పరిమితిలో 30 శాతానికి మించి ఉపయోగించవద్దు. ఆ క్రెడిట్‌ మీ అవసరాలకు సరిపోకపోతే, రెండు లేదా మూడు క్రెడిట్‌ కార్డ్‌లు తీసుకుని, ప్రతి దానిలో వ్యయం 30 శాతానికి మించకుండా చూసుకోండి. మీ క్రెడిట్ స్కోర్‌ను ఎల్లప్పుడూ 750 కంటే పైన ఉంచుకోండి.

ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీకి లోన్ దొరుకుతుంది, దానిని తక్కువ EMIలతో తిరిగి తీర్చేయవచ్చు. రీపేమెంట్‌ కాలం..చెల్లించే EMI మొత్తం తక్కువగా ఉంచడానికి, రుణాన్ని తిరిగి చెల్లించే కాలాన్ని పెంచండి. మీ లోన్ కాల పరిమితి ఎంత ఎక్కువ ఉంటే మీ EMI తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. 12 శాతం వడ్డీ రేటుతో రూ. 5 లక్షల రుణాన్ని మూడేళ్లలో చెల్లించిన కేస్‌తో పోలిస్తే, ఐదేళ్లలో చెల్లించిన కేస్‌లో ఈఎంఐ కచ్చితంగా తగ్గుతుంది. అయితే, కాల పరిమితి పెరిగితే EMI తగ్గినప్పటికీ, చెల్లించాల్సిన వడ్డీ మొత్తం పెరుగుతుందని గుర్తుంచుకోండి. తక్కువ వడ్డీ రేట్ల కోసం బ్యాంక్‌తో చర్చలు..

తక్కువ వడ్డీ రేటు కోసం బ్యాంక్‌తో చర్చలు జరపడం కూడా మీ EMIని తగ్గించడంలో సాయపడుతుంది. దీని కోసం మీరు నమ్మకమైన కస్టమర్‌గా బ్యాంక్‌ను నమ్మించాలి, అదే సమయంలో అధిక క్రెడిట్‌ స్కోర్‌ & మచ్చలేని క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండాలి. అప్పటికీ, బ్యాంక్ వడ్డీ రేటును తగ్గించకపోతే, రుణం మంజూరు చేసిన తర్వాత, అనుకూలమైన వడ్డీ రేట్లను అందించే మరొక బ్యాంక్ కోసం సెర్చ్‌ చేయండి. మీ రుణాన్ని ఆ బ్యాంక్‌ దగ్గర రీఫైనాన్స్ చేయండి. లోన్‌లో ఎక్కువ భాగాన్ని వీలైనంత ముందే తిరిగి చెల్లించడం వల్ల కూడా మీ భవిష్యత్ EMIలను తగ్గించవచ్చు. ఇది కాకుండా, వివిధ రకాల EMI కాలిక్యులేటర్‌లను ప్రయత్నించడం వల్ల కూడా మీకు ప్రయోజనం ఉంటుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *