బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ – హరికృష్ణ ఎందుకు రాలేదు..? ఆ కారణం తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

నారా ఫ్యామిలీ.. దగ్గుబాటి ఫ్యామిలీ.. ఇలా నందమూరి ఫ్యామిలీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీని, రాష్ట్రాన్ని ఏలుతున్నారు ఎన్టీఆర్ ఫ్యామిలీ. ఈక్రమంలో బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నటవారసత్వం నిలబెట్టిన హీరో. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇప్పటికీ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు బాలయ్య. అలాగే రాజకీయాల్లో సక్సెస్ అయిన పురందరేశ్వరి కూడా అందరికీ సుపరిచితమే. ఇక చంద్రబాబు భార్యగా నారా భువనేశ్వరి కూడా అందరికీ తెలుసు.

అయితే ఈ విషయం పక్కన పెడితే సీనియర్ ఎన్టీఆర్ తన కన్న కొడుకు బాలకృష్ణ పెళ్లికి రాలేదు. అంతేకాదు ఈ పెళ్లికి బాలకృష్ణ అన్నయ్య హరికృష్ణ కూడా రాలేద‌న్న‌ది వాస్త‌వం. మరి సొంత కొడుకు పెళ్లికి సీనియర్ ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ వసుంధర దేవిని 1982 డిసెంబర్ 8న వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. అయితే ఈ పెళ్లికి సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ హాజరు కాకపోవడం గమనార్హం.

అయితే బాలకృష్ణ, రామకృష్ణ ఇద్దరి పెళ్లిళ్లు ఒకేసారి జరిగాయి. ఇక వీరి పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ హాజరు కాకపోవడానికి కారణం ప్రజాయాత్ర. టిడిపి పెట్టిన సమయంలో ఆయన ఎక్కువగా ప్రజల్లో తిరుగుతూ ఉండేవారు. ఇక తన కొడుకు పెళ్లి కోసమని ప్రజా యాత్ర లో పాల్గొనకపోతే యాత్రకి ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశంతో సొంత కొడుకుల పెళ్లికి కూడా ఎన్టీఆర్ హాజరు కాలేదట. అయితే రామకృష్ణ, బాలకృష్ణ ఇద్దరి పెళ్లిళ్లు తిరుపతిలో జరిగాయి.

పెళ్లయ్యాక ఈ ఇద్దరు కొడుకులు నేరుగా వెళ్లి తన తండ్రి ఎక్కడ ప్రజా యాత్రలో ఉన్నారో ఆ ఊరికే వెళ్లి తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. దాంతో సీనియర్ ఎన్టీఆర్ డెడికేషన్ కి అప్పట్లో చాలామంది ఫిదా అయిపోయారు. అయితే ఈ విషయాన్ని ఆ మధ్యకాలంలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సీనియర్ నటుడు నిర్మాత అయిన మాగంటి మురళీ మోహన్ గుర్తు చేశారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *