అరవింద్ స్వామి చెన్నైలో జన్మించాడు. అతన్ని పెంచిన తల్లిదండ్రులు పారిశ్రామికవేత్త వి. డి. స్వామి, భరతనాట్య కళాకారిణి యైన వసంతస్వామి. అతని అసలు తండ్రి ఢిల్లీ కుమార్. శిష్య స్కూల్లో, డాన్ బాస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. అయితే అరవింద్ స్వామి.. 1991లో మణిరత్నం – రజినీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన దళపతి సినిమాతో ఆయన నటుడిగా పరిచయమయ్యారు. అప్పుడు ఆయన వయసు కేవలం 20 ఏళ్ళు.
మహాభారతం ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో అర్జునుడి పాత్రలో అరవింద్ స్వామి నటించి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. దళపతి సినిమాలో అరవింద్ స్వామి నటనకు మెచ్చిన మణిరత్నం తన తర్వాతి సినిమాకి ఆయన్నే హీరోగా పెట్టారు. ఆ సినిమా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఓమాస్టర్ పీస్‌గా నిలిచింది. అదే రోజా. ఈ సినిమాతో అరవింద్ స్వామికి చాక్లెట్ బాయ్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన బాంబే సినిమాలోనూ నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న అరవింద్ స్వామి 2005లో ఓ ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో ఆయన కాలు పక్షవాతానికి గురయ్యింది. దాంతో దీంతో రెండేళ్ళపాటు మంచానికే పరిమితమైన అరవింద్ స్వామి, స్వామి నెమ్మదిగా కోలుకున్నారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పటికే ఆయన మార్కెట్ కోల్పోవడంతో వ్యాపారంపై దృష్టి సారించారు. టాలెంట్ మాక్సిమస్ అనే కంపెనీని స్థాపించి దానిపై దృష్టి పెట్టారు. ఆ కంపెనీ ప్రస్తుత విలువ ₹3300 కోట్లు. ప్రమాదం నుంచి కోలుకున్న అరవింద్ స్వామి, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చినా, ఆయనకు మళ్ళీ గుర్తింపు తెచ్చిన సినిమా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన తని ఒరువన్.
ఆ సినిమాలో స్టైలిష్ విలన్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్న అరవింద్ స్వామి, ఆ తర్వాత మళ్ళీ ఫామ్‌లోకి వచ్చి వరుస సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్ఇ గా ఆయన నటించిన సినిమా మంచి విజయాన్ని సాధించింది. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. నవరస అనే వెబ్ సిరీస్‌లో విజయ్ సేతుపతి నటించిన కథను ఆయనే దర్శకత్వం వహించారు.