టాలీవుడ్ నటి అనసూయ పబ్లిసిటీ కోసమే సోషల్ మీడియాలో పడరాని పాట్లు పడుతోంది. ఏ చిన్న పార్టీకి వెళ్లినా..ఎక్కడ ఈవెంట్ జరిగిన అక్కడ వెళ్లి కెమెరాకు హాట్ హాట్ పోజులిచ్చి కుర్రాళ్లను అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తోంది. అయితే అందంతో అట్రాక్ట్ చేయడంలో హీరోయిన్లకు పోటీ ఇస్తోంది అనసూయ. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ లుక్స్ షేర్ చేస్తూ జనాల్లో హాట్ టాపిక్ అవుతోంది. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో అనసూయ పేరు ముందు వరుసలో ఉంటుంది.
మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేయడం అనసూయ నైజం. అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారి గుండెల్లో గూడు కట్టుకుంది ఈ గ్లామర్ లేడీ. అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారి.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది. జబర్దస్త్ భామగా యాంకర్ అనసూయకు సూపర్ పాపులారిటీ దక్కింది. ఈ వేదికపై హంగామా చేస్తూ ఫుల్ పాపులర్ అయింది.
మెల్లగా వెండితెర వైపు పయనం మొదలుపెట్టి టీవీ షోస్ కి గుడ్ బై చెప్పేసింది అనసూయ.అటు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతూ వస్తున్న అనసూయ. తనకు సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ వదులుతూ అట్రాక్ట్ చేస్తుంది. వెండితెరపై తన మార్క్ చూపెడుతున్న ఈ భామకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అయితే తనకూ పిల్లల గురించి ఒక ఆశ ఉండిపోయిందట..
తనకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నా మూడో సంతానం కావాలి అంటుంది. అయితే ఈ మూడో సంతానం ఆడపిల్లే కావాలి అంటుంది. ఆడపిల్ల కావాలనే ఆశ ఎప్పటి నుంచో ఉంది అని చెప్తుంది. కానీ ఈ ఆశ ఆశగానే ఉండిపోయేలా ఉంది,ఎందుకంటే నా భర్త దీనికి ఒప్పుకోవట్లేదు. ఈ విషయంలో నాతో కోపరట్ చేయట్లేదు అంటుంది. మరి ఈ అందాల భామ అదృష్టం ఎలా ఉండబోతుందో చూద్దాం.