ఎలా ప్లాన్ చేస్తే తన కెరీర్ ముందుకెళ్తుందో, ఎలాంటి కథలు ఎంచుకుంటే ప్రేక్షకుల్లో తను రెజిస్టర్ అవుతానో లాంటి విషయాలు అనన్యకు బాగా తెలుసు. అప్పటివరకు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన అనన్య నాగళ్ల కెరీర్.. ‘వకీల్ సాబ్’ మూవీతో పూర్తిగా టర్న్ అయిపోయింది. అయితే తెలంగాణలోనే పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇంకేముంది లక్షల జీతం.. అందులోనూ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ జాబ్.. వేరొకరు లైఫ్ సెటిల్ అని రిలాక్స్ అయిపోతారు.
కానీ ఈ సొగసరి మాత్రం డిఫరెంట్ గా ఆలోచించింది. సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ అనతికాలంలోనే తెలుగు నాట క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు సహాయనటిగా ఇతర హీరోల సి చిత్రాల్లోనూ మెప్పిస్తోందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు నాట క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు అ నన్య నాగళ్ల.
అదే సమయంలో అనన్యకు సంబంధించిన చిన్ననాటి అరుదైన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తు పల్లికి చెందిన అనన్య హైదరాబాద్ లో నే బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో కూడా చేరింది. అయితే జాబ్ చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత ప్రియదర్శితో కలిసి మల్లేశం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి, పొట్టేల్, తంత్ర తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.