గతంలోనే 25 లక్షల రూపాయిలు అల్లు అర్జున్ నష్టపరిహారం ప్రకటించినప్పటికీ ఆతర్వాత అతను అరెస్ట్ అవ్వడం.. బెయిల్ లెట్ అయినందుకు ఒకరోజు రాత్రి అంతా కూడా అతను జైల్లోనే గడపాల్సి రావడం జరిగింది. అయితే అల్లు అర్జున్ జైలుకు వెళ్లినందుకు సెలెబ్రెటీలు అందరూ కూడా ఆయన్ని పరామర్శిశించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పేరుకే అల్లు అర్జున్ కి మేనత్త అయినా.. తన కొడుకు రామ్ చరణ్ కంటే కూడా ఎక్కువగా అల్లు అర్జున్ ను ఆదరించారట. ప్రతి విషయంలో కూడా అల్లు అర్జున్ కి అండగా నిలిచారట సురేఖ.
అల్లుడికి కష్టం వస్తే తల్లి కంటే ఎక్కువగా బాధపడుతారట. అందుకే ఇప్పుడు తన మేనల్లుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి, అల్లుడి కోసం అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సురేఖ తన మేనల్లుడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడాలని, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ 1000 మందికి అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యంగా బన్నీ పేరు పైన ప్రత్యేకంగా పూజలు, అర్చనలు చేయిస్తూ.. ఈ కేసు నుంచి ఆయన త్వరగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారట.
ఇక ఈ విషయం తెలిసి కనీసం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకైనా ఈ ఆలోచన ఎందుకు రాలేదు? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరొకవైపు మేనల్లుడి కోసం మేనత్త పడే తపన అందరికీ ముచ్చట వేస్తోంది అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి సురేఖ పూజలు ఫలించాలని కూడా కోరుతున్నారు. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ షో డిసెంబర్ 4న వేశారు. అందులో భాగంగానే హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి ర్యాలీ నిర్వహించుకుంటూ ఫ్యామిలీతో వచ్చారు బన్నీ. బన్నీని చూడడానికి అభిమానులు ఎగబడగా.. బౌన్సర్లు కాస్త హద్దు మీరారు. దీంతో తొక్కిసలాట జరిగింది.
ఈ విషయంపై అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది. దీనికి తోడు మరొకవైపు తొక్కిసలాటలో రేవతి మరణించగా ఆమె కొడుకు హాస్పిటల్ పాలయ్యారు. ఈ విషయాలపై అరెస్టు అయిన అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద వచ్చారు. కానీ ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన మేనల్లుడికి ఎలాంటి సమస్యలు రాకూడదని, కేసు కొట్టి వేయాలనే నేపథ్యంలో సురేఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.