Sakshi Shivanand | ఒకప్పటి స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్ అందరికీ సుపరిచితమే. చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్టర్’ మూవీతో ఈమె టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత ‘కలెక్టర్ గారు’ ‘రాజహంస’ ‘నిధి’ ‘స్నేహితులు’ ‘ఇద్దరు మిత్రులు’ ‘సముద్రం’ ‘సీతారామరాజు’ ‘పెళ్లివారమండి’ ‘యమజాతకుడు’ ‘వంశోద్ధారకుడు’ ‘యువరాజు’ ‘మా పెళ్ళికి రండి’ ‘సింహరాశి’ ‘హోమం’ ‘రంగ ది దొంగ’ వంటి సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది సాక్షి శివానంద్.
అటు తర్వాత ఈమె ఎక్కువ సినిమాల్లో నటించలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఓ సీనియర్ హీరో .. ఈమె పై చెయ్యి చేసుకున్నాడు. తర్వాత ఈమె కేసు వేస్తె తన పలుకుబడి ఉపయోగించి ఆ కేసు కొట్టించేశాడు. పైగా ఈమెతో నష్టపరిహారం కూడా కట్టేలా చేశాడు.ఆ సీనియర్ హీరో కారణంగా ఈమె టాలీవుడ్ కు దూరమైంది ప్రస్తుతం ఆమె చేస్తుందో,

ఎక్కడ ఉందో అప్డేట్ లేదు కానీ.. ఆమె సోదరి, నటి ఓహానా ఆనంద్ అలియాస్ శిల్పా శివానంద్ తన సోషల్ మీడియాలో తన ఫోటోలతో పాటు తన సోదరి ఫోటోలను పంచుకుంటుది. అయితే ఇప్పటికి సాక్షి శివానంద్ అంతే అందంతో మెస్మరైజ్ చేస్తుంది. శిల్పా, సాక్షి శివానంద్ ఇద్దరూ మంచు ఫ్యామిలీ హీరోలతో నటించారు. 90లో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో.. ఈ బ్యూటీ కూడా రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్..
