Kavitha Bail: కవిత మళ్లీ అరెస్ట్ అవుతారా..? బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుందో తెలుసా..?
Kavitha Bail: కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. ఈడీ, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, డిపి సింగ్ వాదనలు వినిపించారు. సుమారు గంటన్నర పాటు కోర్టులో వాదనలు కొనసాగాయి. సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్ కు అర్హురాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని ఈడీ, సీబీఐ చెబుతున్నాయే తప్ప.. కేసును కొలిక్కి తేలేకపోతున్నాయి. దర్యాప్తు ఏళ్లకు ఏళ్లు కొనసాగుతోంది. ఇంకా ఎన్నేళ్లు సాగుతుందో తెలియదు.
Also Read: రోడ్డుపై అమ్మాయి వేసుకొని హీరో అయిపోదాం అనుకున్నాడు, చివరికి ఏం జరిగిందో చుడండి.
దర్యాప్తు పూర్తయ్యాక, కోర్టు తీర్పు, దానికి పై కోర్టు తీర్పు, ఆ పై సుప్రీంకోర్టు, ఏక సభ్య ధర్మాసనం, త్రిసభ్య ధర్మాసనం, 5గురు సభ్యుల ధర్మాసనం, 7గురు సభ్యుల ధర్మాసనం.. ఇలా ఇది అంతులేని చరిత్ర అవుతోంది. మన న్యాయవ్యవస్థలో జరుగుతున్న జాప్యం కారణంగా.. చాలా మంది రాజకీయ నేతలు నిందితులుగా మిగిలిపోతున్నారు. వారు నేరం చెయ్యకపోతే, నిర్దోషిగా సమాజం వారిని గుర్తించాలి. నేరం చేస్తే, దోషిగా శిక్షను అనుభవించాలి. ఏదీ జరగట్లేదు. కవిత పరిస్థితీ ఇంతే. ఈ కేసు ఎప్పటికి తేలుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు లేదు. అందువల్ల బీజేపీకి ఇతర పార్టీల మద్దతు అవసరం అవుతోంది. ఎప్పుడు ఏ పార్టీ కీలకం అవుతుందో చెప్పలేని పరిస్థితి. అందువల్ల తెలంగాణలో బీఆర్ఎస్‌ని పక్కన పెట్టలేని స్థితి ఉంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే, తాము మళ్లీ అధికారంలోకి రావగలం అనే అంచనాలో కాంగ్రెస్ ఉంది. అలా జరగకూడదంటే.. బీఆర్ఎస్, బీజేపీ జట్టు కట్టాల్సి రావట్టు. పొత్తు పెట్టుకుంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు. అలా పొత్తులు కుదరాలంటే.. కవిత మళ్లీ జైలుకు వెళ్లకూడదు. ఢిల్లీ లిక్కర్ కేసు ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడం వల్ల ఈ కేసులో ఆమెను ఇప్పట్లో దోషిగానో, నిర్దోషి గానో చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాగే.. బెయిల్ షరతులను ఆమె ఉల్లఘించనంతవరకూ ఆమెను మళ్లీ అరెస్టు చేసే అవకాశాలు తక్కువే. ఇంకేదైనా కేసులో నిందితురాలు అయితే మాత్రం అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ పరిస్థితి ఉంటుందని అనుకోలేం. అందువల్ల కవిత మళ్లీ అరెస్టు అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.
Also Read: ఐదు నెలలు జైలులోనే ఉన్న కవిత, ఎంత బరువు తగ్గిందో తెలుసా..?
ఐతే.. ఆమెకు లభించిన బెయిల్, పార్టీకి ప్లస్సా, మైనస్సా అనేది మరో తేలాల్సిన అంశం. విశ్లేషకుల ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బాగా చతికిలపడింది. అదే సమయంలో కాంగ్రెస్ ఆకర్షణ మంత్రంతో.. కారు దిగి చాలా మంది ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ.. హస్తం గూటికి చేరారు. దాంతో పార్టీ మరింత డౌన్ అయ్యింది. ఐతే.. ప్రజా సమస్యలపై ఆ పార్టీ పోరాటాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా రైతు రుణమాఫీపై గట్టిగానే పోరాడటంతో.. కొంత మళ్లీ గ్రాఫ్ పెరుగుతోంది. ఇక ఇప్పుడు కవిత కూడా బెయిల్‌పై రిలీజ్ అవ్వడంతో.. ఆ పార్టీకి ఇది మరింత బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు. తద్వారా శ్రేణుల్లో ఒకింత ఉత్సాహం కనిపిస్తోంది.
Also Read: స్త్రీ పురుషులిద్దరు పెళ్లికి ముందు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటో తెలుసా..?
కవిత రిలీజ్ అంశం బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందా అంటే.. అలా ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. కవిత నిర్దోషిగా రిలీజ్ కాలేదు. బెయిల్‌పై విడుదల అయ్యారు. అందువల్ల ఇదేమంత గొప్ప విషయం కాదంటున్నారు. పైగా.. కవిత అరెస్ట్ అయినప్పుడు.. పార్టీ శ్రేణుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఢిల్లీలో కూడా ఎలాంటి ఆందోళనలూ జరగలేదు. అందువల్ల ఇప్పుడు ఆమె బెయిల్‌పై వచ్చినా, రెస్పాన్స్ పెద్దగా ఉండదని అంటున్నారు. దీని ద్వారా మైలేజ్ పొందటం కంటే.. ప్రజా సమస్యలపై పోరాడటం ద్వారానే మంచి మైలేజ్ వస్తుందని అంటున్నారు. గ్యారెంటీ హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఉపయోగం ఉండొచ్చు అంటున్నారు.