Tirumala: తిరుమల వెళ్ళే వారికీ అలెర్ట్, నడకదారిలో మరోసారి చిరుత కలకలం..?
Tirumala: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్‌రోడ్డులోని 55, 56 మలుపు సమీపంలో చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్లింది. ఈ విషయాన్ని వాహనచోదకులు గుర్తించారు. వెంటనే వారు టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శేషాచలం అడవిలో చిరుతల సంచారం అధికంగా ఉంది. అయితే మొన్నటి వరకూ అలిపిరి మెట్ల మార్గంలో సంచరించిన చిరుతలు ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గంలో తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.
Also Read : అప్పులతో బాధపడుతున్నారా..? ఏడు శనివారాలు ఇలా పూజ చేస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి.
తాజాగా నేడు తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఓ చిరుతను భక్తులు చూశారు. శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చంద్రగిరి వద్ద నుంచి సాగే శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతను గమనించినట్లు భక్తులు అధికారులకు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ అధికారులకు చిరుత సంచారం సమాచారం అందింది. వెంటనే టీటీడీ అధికారులు చిరుత ఎక్కడుందో గుర్తించేందుకు రంగంలోకి దిగారు.
శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లేవారిని గుంపులుగా పంపిస్తున్నారు. చిరుత సంచారం వల్ల శ్రీవారి మెట్టు కింది భాగంలో ఉన్న వాటర్ హౌస్ వద్ద భక్తులను కొద్దిసేపు నిలిచి ఉంచారు. సెక్యూరిటీ అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. భక్తులు భయాందోళన చెందొద్దని, చిరుత సంచారం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Also Read : సంతానం లేని దంపతులు ఈ జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంటే చాలు సంతానం కలుగుతుంది.
శ్రీవారి మెట్టు మార్గంలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నామని, భక్తులు ఆందోళన చెందొద్దని, దర్శనానికి వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడ కనిపించలేదని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టినట్లు టీటీడీ వెల్లడించారు.