Walnuts: వాల్‌నట్స్ రోజు తింటే.. మీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి.

divyaamedia@gmail.com
2 Min Read

Walnuts: వాల్‌నట్స్ రోజు తింటే.. మీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి.

Walnuts: వాల్‌నట్‌ల ప్రయోజనాలు మీరు ఒక రోజులో ఎంత తింటారు, ఎలా తింటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాల్‌నట్‌లు ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ లతో కూడిన సూపర్‌ఫుడ్‌లు. వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. వాల్‌నట్స్ జుట్టు పల్చబడకుండా కూడా కాపాడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన వాల్‌నట్‌లను తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

Also Read : ఈ ఆకులను ఇలా చేసి తీసుకుంటే చాలు, 300 రోగాలను తగ్గించే దివ్య ఔషదంఇదే.

ఇది మెదడును పెంచే శక్తి ఇంకా మొక్కలతో నడిచే ప్రోటీన్‌కు మంచి మూలం. అందుకే దీనితో మనం వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.వాల్ నట్స్ లో కేలరీలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివలన వీటిని తిన్న వెంటనే ఇన్ స్టాంట్ మనకు శక్తి వస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే వీటిని తీసుకోవటం వలన మీరు రోజువారి పని చేసేందుకు ఎంతో శక్తిని ఇస్తుంది. అంతేగాక ఈ వాల్ నట్స్ అనేవి ఫైబర్ కు పెట్టింది పేరు. ఇవి మన జీర్ణ క్రియతో పాటుగా బరువును నియంత్రించేందుకు సహాయపడతాయి.

Walnuts

పైగా దీనిలో ఉన్న ఫైబర్ వలన పొట్ట ఎక్కువ సేపు నిండిన ఫీలింగ్ మనకు ఉంటుంది. దీంతో మనకు ఆకలి ఉండదు. దీంతో బరువు కూడా ఈజీగా కంట్రోల్ లో ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఆహారం కాబట్టి హృదయ సంబంధ వ్యాధుల అవకాశాలను తగ్గించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. అవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటాయి. నాన బెట్టిన వాల్ నట్ లు విటమిన్ E, మెగ్నీషియం ఇంకా ఫోలేట్ యొక్క మంచి మూలంగా పరిగణించబడతాయి.

Also Read : ప్రతి రోజూ ఒక గ్లాస్‌ లెమన్‌ వాటర్‌. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అందుకే మీ దినచర్యలో నానబెట్టిన వాల్‌నట్‌లను చేర్చడం వలన గణనీయమైన పోషకాహారం అందించబడుతుంది. ఇది సంపూర్ణ ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు, మెదడును మెరుగుపరిచే పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ కూడా కొన్ని వాల్‌నట్‌లను తప్పకుండా తీసుకోండి.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *