మన భారతదేశం ఎన్నో సంప్రదాయాలకు పుట్టినిల్లు. తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు అలనాటి కట్టడాలు కళాత్మక చిత్రాలు ఇలా ఎన్నో భారతదేశ సార్వభౌమధికారాన్ని తెలుపుతూ ఉంటాయి. అంతేకాదు భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలు, సామ్రాజ్యాల గుర్తులు, రాజుల పరిపాలనకు అర్థం పట్టినట్టుగా వాటి గుర్తులు నేటికీ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి. అలనాటి రాజుల కాలంలో నిర్మించిన ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలు నేడు వాటి చరిత్రను తెలిపే విధంగా పర్యాటక ప్రాంతాలుగా మారి ఔరా అనే విధంగా ఆశ్చర్యపరుస్తుంటాయి. మన భారతదేశంలో పూర్వం కులమతాలకతీతంగా ప్రాంతీయ భాష విభేదాలు లేకుండా రాజులు రాజ్యాలకు అధిపతులుగా ఉండి భారతదేశాన్ని పాలించేవారు.
అలా రాజుల కాలంలో ఉన్నటువంటి ఒక సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం అదే నేటి ( హంపి నగరం )… కర్ణాటక ప్రాంతంలో ఉండే ఈ హంపి నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది విజయనగర సామ్రాజ్యమైన ఈ హంపినగరం చూడాలంటే రెండు కన్నులు సరిపోవు. ట్రాక్ సిటీగా చరిత్రలో నిలిచిపోయిన ఈ హంపినగర అందాలను తిలకించేందుకు దేశ విదేశాలనుంచి కూడా నిత్యం ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. హంపి పరిసరాల్లోకి చేరుకోగానే అద్భుతమైన రాతి ద్వారాలు, కొండలు గుట్టలు ఆలయ కట్టడాలు, పండగల సమయాల్లో ఇంటికి కట్టుకునే మామిడి తోరణాలు లాంటి కొబ్బరి చెట్లు చుట్టూ అరటి తోటలు మనకు స్వాగతం పలుకుతాయి.
హంపిలో ముఖ్యంగా మనం చూడవలసిన ప్రదేశం విజయ్ విట్టల టెంపుల్ ఇక్కడ విగ్రహం అయితే ఉండదు కానీ అద్భుతమైన ఆలయ కట్టడాలు శిలా, శిల్పాలు, చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. విజయనగర సామ్రాజ్యంలో 1422లో గరుడదేవరాయ నిర్మించినది ఈ విజయ విట్టల ఆలయం. 13వ శతాబ్దంలో ఏర్పడిన విజయనగర సామ్రాజ్యం 15వ ముగిసిపోతుందని ఇక్కడి వారు తెలుపుతున్నారు. కేవలం 230 సంవత్సరాలు మాత్రమే విజయనగర సామ్రాజ్యం ఉండిందట. అయితే ఇందులో ముఖ్యంగా విజయ విట్టల ఆలయం గురించి తెలుసుకోవాల్సిందే. 1422లో గరుడా దేవరాయలు నిర్మించిన ఈ క్షేత్రంపై తాళికట్ చెందిన బహుమనీ సుల్తాన్ దండయాత్రగా వచ్చి యుద్ధం చేసి హలియా రామరాయ అనే రాజును సంహరించినప్పుడు.
ఈ రాజ్యంలో ఉండే మిగతా రాజులు,సామంత రాజులు, సైనికులు ఈ రాజ్యాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెనుగొండ నగరానికి వెళ్లిపోతారట. అప్పుడు ఈ రాజ్యాన్ని బహుమనీ సుల్తాన్ ఆక్రమించుకుని మూడు నెలల పాటు ఈ రాజ్యంలో ఉండే రత్నాలు రాసులు, బంగారు ఆభరణాలన్నీటిని దోచుకుని మరో మూడు నెలలు ఈ రాజ్యంలోని రాతి కట్టడాలు ఆలయాలు విగ్రహాలు అన్నిటినీ కూల్చి వేశాడని అందుకే ఈ విజయ విట్టల ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని ఇక్కడివారు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉండే రథం గురించి మనం చెప్పుకోవాలి. పూర్తిగా 7 లేయర్లతో అప్పట్లోనే ఇంటర్ లాకింగ్ సిస్టం ద్వారా పూర్తిగా రాతితోనే అద్భుతంగా తయారు చేసారు.
ఈ రథాన్ని మనం మన భారత దేశ కరెన్సీ నోట్ల మీద చూస్తూ ఉంటాం. ఇంతటి అద్భుతమైన ఈ రాతి రధాన్ని మహారాష్ట్రకు చెందిన గుంజన్ బర్జాడ్ ప్రియా అనే పర్యటకురాలు సోలో ట్రావెలింగ్ చేస్తూ హంపి నగరానికి వచ్చిన ఆమె ఈ రథం బొమ్మను ఎంతో అద్భుతంగా గీసి ఔరా అనిపించింది. తాను ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఎంతో గర్వంగా ఉంది అని తెలుపుతూ. రాక్ సిటీగా పేరుపొందిన ఈ విజయనగర సామ్రాజ్యం చరిత్రను తెలుసుకోవడం మాటల్లో వర్ణించలేనిది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. మీరు కూడా ఇలాంటి చారిత్రకమైన విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకొని చూడాలంటే మాత్రం కచ్చితంగా హంపి నగరానికి రావాల్సిందే.