స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్ స్లే.. తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ లోనూ నటించాడు. అయితే ఈ రెడిన్ కింగ్ స్లే సినిమాతోనే కాకుండా 47 ఏళ్ల వయసులో ఆలస్యపు వివాహం చేసుకుని ఆ మధ్య నెట్టింట సంచలనమైన సంగతి తెలిసిందే. 2023 లో సీరియల్ నటి సంగీతను వివాహం చేసుకున్నాడు. ఇది ప్రేమ వివాహం. ఈ పెళ్లిపై రెడిన్ ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. ఆ సంగతి పక్కనబెడితే తాజాగా రెడిన్ -సంగీత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే 2023లో తన ప్రేయసి సీరియల్ నటి సంగీతను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే 45 ప్లస్ లో ఉన్న ఆయన ఒక బుల్లితెర నటిని ప్రేమ వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కొందరు విమర్శలు కూడా గుప్పించారు. అయితే వీటన్నింటినీ లెక్క చేయకుండా హ్యాపీగా తమ లైఫ్ ను లీడ్ చేస్తున్నారీ లవ్లీ కపుల్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న రెడిన్ త్వరలోనే తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. ఆయన భార్య సంగీత ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది.
అయితే ఈ శుభవార్తను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు రెడిన్ దంపతులు. అయితే సంగీత సీమంతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. సంగీత మేకప్ ఆర్టిస్ట్ రెడిన్ భార్య సీమంతం వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రెడిన్- సంగీత దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా గతేడాది ఏకంగా 10 సినిమాల్లో నటించాడు రెడిన్. అందులో క, బ్లడీ బెగ్గర్, కంగువా, మ్యాక్స్ వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నటుడి చేతిలో పలు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.