సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల్ని ప్రోత్సహించేలా దీన్ని అమలు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు ₹1000 చొప్పున రెండేళ్లు అందుతాయి. కుటుంబ వార్షికాదాయం ₹8లక్షలలోపు ఉండాలి. అయితే పేద పిల్లలతో పాటు అమ్మాయిలను చదువుల్లో ముందుంచాలనే సంకల్పంతో ప్రభుత్వం పలు కీలక పథకాలు అమలు చేస్తోంది.
అందులో ఒకటి సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం. పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఈ స్కీం రూపొందించారు. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలను విద్యలో ప్రోత్సహించడమే ఈ మెరిట్ స్కాలర్‌షిప్ ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో భాగంగా CBSCలో 70 శాతం మార్కులతో పదో తరగతి పాసైన విద్యార్థినులకు ప్రతి నెలా రూ. 1000 చొప్పున రెండు సంవత్సరాల పాటు స్కాలర్‌షిప్ అందించబడుతుంది.
ఇప్పటికే ఈ స్కాలర్‌షిప్ అప్లికేషన్స్ షురూ చేశారు. తొలుత డిసెంబర్ 23 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా పేర్కొన్నారు. కానీ ఆ గడువు కాస్త పొడగించి ఇప్పుడు జనవరి 10వ తేదీ వరకు పెంచారు. అర్హతలు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి విద్యార్థినులు సీబీఎస్‌ఈ పదో తరగతి ఉత్తీర్ణత (70% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు) సాధించాలి. విద్యార్థినులు ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి లేదా 12వ తరగతి చదువుతుండాలి.
తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. స్కాలర్‌షిప్‌ను కొనసాగించడానికి విద్యార్థినులు 11వ తరగతి తర్వాత 12వ తరగతికి చేరినప్పుడు రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ కోసం కనీసం 70% మార్కులు సాధించడం తప్పనిసరి. ఈ స్కీమ్ విద్యార్థినుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది.