మార్క్ జుకర్‌బర్గ్ ధరించిన వాచ్ ప్రపంచంలోని అత్యంత సన్నని మెకానికల్ వాచీలలో ఒకటి. BVLGARI ఆక్టో ఫినిస్సిమో ఆల్ట్రా COSC వాచ్ చాలా స్లిమ్‌గా కనిపిస్తుంది. ఇది టైటానియంతో తయారు చేయబడింది. ఈ వాచ్ రెండు పేర్చబడిన క్రెడిట్ కార్డ్‌ల కంటే సన్నగా ఉంటుంది. అయితే మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మరోసారి ముఖ్యాంశాలలో నిలిచారు. ఈసారి చర్చకు కారణం అతని లగ్జరీ వాచ్. ఇటీవల మార్క్ జుకర్‌బర్గ్ మెటాలో AI అప్‌డేట్‌లను చర్చించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సమయంలో అతని మణికట్టు మీద కనిపించిన వాచ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఇప్పుడు ఈ వాచ్ చర్చనీయాంశంగా మారింది. ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటి? ఆక్టో ఫినిస్సిమో అల్ట్రా SOSC అనేది ప్రపంచంలోనే అత్యంత సన్నని మెకానికల్ వాచ్. ఇది కేవలం 1.7 మిమీ మందంతో ఉంటుంది. ఇది రెండు క్రెడిట్ కార్డ్‌ల పరిమాణం. ఇది పరిమిత ఎడిషన్ వాచ్. ఇందులో 20 యూనిట్లు మాత్రమే తయారు చేస్తారు. ఈ గడియారాన్ని స్టోర్ చేయడానికి స్పెషల్‌గా తయారు చేసిన కేస్‌తో వస్తుంది. స్వయంచాలకంగా సెట్ చేస్తుంది. ఈ వాచ్‌లో కేసులో పెట్టేందుకు వాచ్ విండో దానికదే ఓపెన్ అవుతుంది.
ఇందులో 170 విభిన్న భాగాలు చేర్చి తయారు చేసింది కంపెనీ. వాచ్ ప్రధాన ప్లేట్ టంగ్‌స్టన్ కార్బైడ్‌తో తయారు చేశారు. బ్రాస్లెట్, లగ్స్, టైటానియంతో తయారు చేశారు. ఈ గడియారం స్విస్ అధికారిక క్రోనోమీటర్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ (COSC) నుండి సర్టిఫికేట్ పొందింది. ఈ లగ్జరీ వాచ్ ధర సుమారు అక్షరాల రూ. 5 కోట్లు. మార్క్ జుకర్‌బర్గ్ ఖరీదైన, ప్రత్యేకమైన గడియారాలను ఇష్టపడతారు.
గత నెలలో అతను మరో లగ్జరీ వాచ్ De Bethune DB25 స్టార్రి వేరియస్ ఏరోలైట్ ధరించి కనిపించాడు. ఈ వాచ్ పరిమిత ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం 5 యూనిట్లు మాత్రమే తయారు చేస్తారు. దీని ధర సుమారు రూ. 2.20 కోట్లు. జుకర్‌బర్గ్ ఈ గడియారాలు అతని అత్యాధునిక, ప్రత్యేకమైన అభిరుచులను చూపుతాయి. ఈ వాచ్ కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంది.