నిర్మాత అనేకల్ బాలరాజ్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి కెంపా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సంతోష్ బాలరాజ్. ఆ తర్వాత హీరోగా గణప అనే సినిమాతో హిట్ కొట్టాడు. సత్యం, కరియా 2 పలు సినిమాల్లో హీరోగా, మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు. అయితే ఈయన కుటుంబం కూడా సినీ నేపథ్యమున్న ఫ్యామిలీ కావడంతో ఈయన అడుగులు సహజంగా సినిమాల వైపు మళ్లింది.
ఈయన తండ్రి అనేకల్ బాలరాజ్ 2003లో దర్శన్ నటించిన హిట్ మూవీ ‘కరియా’ చిత్రాన్ని నిర్మించాడు. ఈయన 2022లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అవివాహితుడైన సంతోష్ తన తల్లితో కలిసి ఉంటున్నాడు. 20215లో విడుదలైన ‘గణప’ చిత్రంతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.

ఈ చిత్రాన్ని ప్రభు శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2012లో తేషి వెంకటేష్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘ఒలావిన్ ఓలే’ సినిమా కూడా సంతోష్ కు మంచి పేరు తీసుకొచ్చింది.ఈ సినిమా పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కింది. 2013 సంవత్సరంలో, చక్రవర్తి దర్శకత్వం వహించిన ‘జన్మ’ చిత్రంలో సంతోష్ కంఠీరవ పాత్రలో నటించాడు.
చివరగా సంతోష్ బాలరాజ్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘కరియా 2’ చిత్రంలో కనిపించాడు. ఈ సినిమా 2017లో విడుదలైంది. అప్పటి నుంచి సినీ రంగానికి దూరంగా ఉంటున్నాడు. తాజాగా పస్కలతో చనిపోయిన సంతోష్ బాలరాజ్ మరణంతో కన్నడ చిత్రసీమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఈయన అకాల మరణం పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.