గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు అభినయ్ కింగర్ ఈ ఉదయం కన్నుమూశారు. కింగర్ కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే మలయాళంలో నటి టి.పి రాధమణి కుమారుడు అభినయ్ కింగర్.
2002లో విడుదలైన తుళ్లువతో ఇలామై సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ హీరోగా తెరంగేట్రం చేయగా.. ఆయన స్నేహితుడిగా అభినయ్ నటించారు. ఆ తర్వాత కైయెత్తుం దూరతు అనే చిత్రం ద్వారా మలయాళ సినిమాలో నటుడిగా అరంగేట్రం చేశాడు.
ఇందులో నటుడు భగత్ ఫాసిల్ హీరోగా పరిచయమయ్యారు. తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో హీరోగా మెప్పించారు. 2014 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నాడు అభినయ్. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 10 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అభినయ్.. ఇటీవలే కొన్ని నెలల క్రితం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అందులో అతడు పూర్తిగా బక్కిచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. తన వైద్య ఖర్చులు భరించడానికి తాను ఇబ్బంది పడుతున్నానని చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత, చాలా మంది అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
కానీ అతడు చికిత్స తీసుకుంటూనే సోమవారం కన్నుమూశారు. ప్రస్తుతం అభినయ్ వయసు 44 సంవత్సరాలు మాత్రమే.
#RIPAbhinay
— Actor Kayal Devaraj (@kayaldevaraj) November 10, 2025
November 10th
Actor #Abhinay best known for his performance in #ThulluvadhoIlamai passes away at the age of 44 #துள்ளுவதோ_இளமை #அபிநய் இன்று காலமானார் pic.twitter.com/esoKC7MfXh
