సురక్షిత శృంగారానికి, అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు ఉపయోగించే కండోమ్‌కు సంబంధించి తాజాగా ఓ కీలక విషయం వెల్లడైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ ధర ఏకంగా అక్షరాలా 44 వేల రూపాయలు. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అయితే జనన నియంత్రణ, గర్భాన్ని నిరోధించేందుకు కండోమ్‌లను ఉపయోగిస్తారు.
కిరాణా నుంచి మెడికల్ షాపుల వరకూ అన్నింటా దొరికే ఈ కండోమ్ మహా అయితే.. రూ. 10 లేదా రూ. 20కి లభిస్తుంది. కొన్ని చోట్ల అయితే ఇంకా తక్కువ ధరలకే ఉంటుంది. అయితే మీరెప్పుడైనా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ గురించి విన్నారా.? 200 ఏళ్ల నాటి ఈ కండోమ్‌ను ఇటీవల వేలంలో విక్రయించారు. ఇంతకీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
200 ఏళ్ల నాటి కండోమ్ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్‌గా పేరుగాంచింది. 460 పౌండ్లు.. అంటే దాదాపు రూ. 44 వేలకు(ఇండియన్ కరెన్సీలో) అమ్ముడైంది. ఇది ఆధునిక లేటెక్స్ కండోమ్‌ల నుంచి భిన్నంగా ఉంటుంది. అలాగే ఇది గొర్రెల పేగుల నుంచి తయారు చేయబడింది. 18వ లేదా 19వ శతాబ్దానికి చెందినదిగా తేలింది.
పూర్వం గొర్రెలు, పందులు, దూడలు, మేకలు వంటి జంతువుల పేగులతో కండోమ్‌లను తయారు చేసేవారు. అందుకే ఈ కండోమ్ చాలా ఖరీదైనది. 19 సెంటిమీటర్లు(7 అంగుళాలు) ఉన్న ఈ కండోమ్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు.