యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో చాలా మంది ఆడవారు బాధపడతారు. ఆడవారికి ఏ టైమ్‌లో అయినా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా, మగవారికి చాలా తక్కువగా వస్తుంది. ఈ సమస్య వస్తే ఆడవారికి మూత్రంలో మంట, రక్తస్రావం, కొన్నిసార్లు జ్వరం కూడా రావొచ్చు. అయితే ఈ రోజుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా 5 ఏళ్లలోపు బాలికల్లోనూ కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే బాలికల్లో ఇలాంటి కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలు..
నీటి కొరత- పాఠశాలకు వెళ్లే బాలికలు సాధారణంగా పాఠశాలలో తక్కువ నీరు తాగుతారు. దీని కారణంగా ఈ వ్యాధి పెరుగుతోంది. మూత్రాన్ని ఎక్కువ సమయం పాటు ఆపుకోవడం – యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన స్కూల్‌కు వెళ్లే బాలికలు ఎక్కువ సమయం పాటు మూత్రానికి వెళ్లకుండా కంట్రోల్ చేసుకుని కూర్చోవడం అంటున్నారు వైద్యులు.. మూత్రాన్ని ఎక్కువ సమయం పాటు ఆపుకోవటం వల్ల మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరుగుతుందని చెబుతున్నారు.
మురికి మరుగుదొడ్లను ఉపయోగించడం- చాలా సార్లు స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండవు. ఆ మురికి సీట్లను ఉపయోగించడం కూడా యూరిన్ ఇన్ఫెక్షన్‌కు కారణం అంటున్నారు వైద్యులు. యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు.. మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట. తరచుగా మూత్రవిసర్జన. మూత్రంలో రక్తం పడటం. జ్వరం, అలసటగా ఉండటం. పొత్తి కడుపులో నొప్పి అనుభూతి.
ఏం చేయాలి.. ఇంట్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లు నేర్పించాలని వైద్యురాలు చెబుతున్నారు. రోజుకు సరైన మొత్తంలో నీరు తాగేలా చూడాలని, వారికి సలహా ఇవ్వాలని చెబుతున్నారు. టాయిలెట్‌ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో నేర్పించాలని చెబుతున్నారు. అలాగే సున్నిత ప్రాంతాల పరిశుభ్రత గురించి కూడా వివరంగా చెప్పాలంటున్నారు.