ఒక వ్యక్తిని పార్ట్‌నర్‌గా కోరుకోవడం, వారిని సొంతం చేసుకోవాలనుకోవడం మధ్య చాలా తేడా ఉంది. పొసెసివ్‌నెస్ కారణంగా కొన్నిసార్లు జంటలు విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పొసెసివ్ బిహేవియర్ లేదా మైండ్‌సెట్ ఇద్దరి మధ్య సంబంధాన్ని నాశనం చేస్తాయి. అయితే స్త్రీలు తరచుగా ప్రత్యేకంగా ప్రయత్నించకుండానే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇది కేవలం వారి శారీరక అందం వల్లే కాదు.. వారి ప్రవర్తన, ఆత్మవిశ్వాసం, మరియు వారు చూపించే చిన్న చిన్న హావభావాలు కూడా కారణమవుతాయి.
చాలా సార్లు పురుషులు మాత్రమే గుర్తించగల చిన్న విషయాలు కూడా ఈ దృష్టి ఆకర్షణలో భాగం అవుతాయి. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం లేదా మార్పు రావడం.. ఆమె ఒక గదిలోకి అడుగుపెట్టగానే, కొంతమంది పురుషులు ఏమి మాట్లాడుతున్నారో ఆపేసి ఆమె వైపు చూడడం మొదలుపెడతారు. ఈ చిన్న క్షణాలు చాలా చెప్పే సంకేతాలు. ఆ ఒక్క చూపు కూడా వారి దృష్టిని ఆమె ఆకర్షించిందని తెలియజేస్తుంది. కొన్నిసార్లు ఇది పూర్తిగా సినిమా సీన్‌లా అనిపిస్తుంది. మీరు గమనిస్తే ఆ గది మొత్తం ఆమె చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
సంభాషణ మొదలుపెట్టడానికి చిన్న చిన్న కారణాలు వెతకడం.. ఆమె ఎక్కడికైనా వెళ్ళినా, అపరిచితులు సైతం మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, కాఫీ షాప్‌లో బారిస్టా ఆమె ఆర్డర్‌ను గుర్తుంచుకొని స్మైలుతో సర్వ్ చేయడం, పుస్తకాల షాప్‌లో ఎవరో ఆమె చదువుతున్న పుస్తకం గురించి అడగడం – ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది ఆమె ఉనికిని గమనిస్తున్న సంకేతం. సాధారణం కంటే ఎక్కువ ప్రశంసలు రావడం.. ఆమెకు దుస్తులపై, హెయిర్ స్టైల్‌పై లేదా చిరునవ్వుపై ఎక్కువ కాంప్లిమెంట్స్ రావడం ప్రారంభమవుతుంది.

ఇది కేవలం స్నేహపూర్వకంగా కాదు, వారి అభిప్రాయాన్ని ఆమెకు తెలియజేయాలనే సహజ ప్రయత్నం. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంచి విషయం కూడా. సోషల్ మీడియాలో కూడా అదనపు శ్రద్ధ.. సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్, ఫాలోస్ ఆకస్మికంగా పెరిగిపోవడం కూడా ముఖ్యమైన సంకేతం. ఆమె ఫోటోలు, స్టోరీలు ఎక్కువ ఎంగేజ్‌మెంట్ పొందుతుంటే, అది ఆమెపై ప్రజల ఆసక్తి పెరుగుతోందని సూచిస్తుంది. చాలా మంది తమ భావాలను నేరుగా చెప్పలేకపోవచ్చు కానీ లైక్ లేదా హార్ట్ బటన్ నొక్కడం ద్వారా తెలియజేస్తారు.
గదిలో ఎనర్జీ మారిపోవడం.. ఆమె ఒక గ్రూప్‌లో చేరినప్పుడు అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉత్సాహంగా మారిపోతుంది. సంభాషణలు మరింత ఫన్‌గా, జోకులు మరింత చమత్కారంగా మారుతాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు – ఆమె ఉనికి చుట్టూ ఉన్న వారిపై ప్రభావం చూపుతోందని ఇది స్పష్టంగా చెప్పే సంకేతం. ఇతర మహిళలు కూడా గమనించడం
మహిళలు సాధారణంగా గదిని చాలా వేగంగా చదవగలరు. మీ ఫ్రెండ్‌లు లేదా సహచర మహిళలు “అతను పూర్తిగా ఆమెను గమనిస్తున్నాడు” అని సరదాగా చెప్పడం మొదలుపెడితే, వారి మాటల్లో నిజం ఉంటుందని గుర్తుంచుకోండి.
సహాయం చేయడానికి ముందుకు రావడం పురుషులు ఆమె కోసం తలుపు ఎక్కువ సేపు పట్టుకోవడం, చిన్న సహాయం చేయడం కోసం తన సమయం కేటాయించడం, లేదా ఏదైనా సమస్య పరిష్కరించడంలో సహకరించడం – ఇవన్నీ వారు ఆమెను గమనిస్తున్నారని తెలియజేస్తాయి. బాడీ ల్యాంగ్వేజ.. ఇది చాలా ఆసక్తికరమైన సంకేతం. పురుషులు ఆమె మాదిరిగా కూర్చోవడం, ఆమె భంగిమను అనుకరించడం, లేదా ఆమె వంటి హావభావాలు చేయడం. ఇవన్నీ ఉపచేతన ఆకర్షణకు ఉదాహరణలు.