విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందని అందరు భావించారు. కానీ ఆమె ఫైనల్ కి కూడా వెళ్లలేకపోయింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 14 మంది సెలెబ్స్ ని బిగ్ బాస్ హౌస్లోకి పంపారు. వారిలో విష్ణుప్రియకు భారీ ఫేమ్ ఉంది.ఇక తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో నమ్మలేని నిజాలను బయట పెట్టింది. అయితే న్ని కోట్లు ఇచ్చిన ఆషోలోకి వెళ్లను అని చెప్పిన విష్ణు.. ఆ తర్వాత సీజన్ 8లో హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది.. కానీ అప్పటివరకు తనకున్న క్రేజ్ తగ్గించుకుంది. నిజానికి విష్ణు టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నారు అడియన్స్.
కానీ హౌస్ లో పృథ్వీతో ప్రేమ, లైక్ అంటూ ధ్యాసంతా అతడిపైనే పెట్టడంతో విపరీతమైన నెగిటివిటీ పెరిగింది. హౌస్ లో పృథ్వీ వద్దని చెబుతున్నా ప్రతిసారి అతడి వెంటే పడుతూ అడియన్స్ దృష్టిలో చిరాకు తెప్పించింది. దీంతో విష్ణు ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఎంతో మంది విష్ణుకు ఎన్నో విధాలుగా చెప్పినా.. పృథ్వీ విషయంలో తన తీరును మాత్రం మార్చుకోలేదు. చివరకు యాంకర్ శ్రీముఖి వచ్చి తన ఆట తీరు గురించి చెప్పిన తర్వాత విష్ణు తన ఆట తీరు మార్చుకుంది. కానీ అదే వారం విష్ణు ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.
టాప్ 5కి చేరకుండా చివరి వారంలో ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బిగ్బాస్ జర్నీపై ఆసక్తికర విషయాలను పంచుకుంది. “బిగ్బాస్ ఎపిసోడ్స్ చూడకుండానే నన్ను ప్రశ్నించారు. చాలా మంది నన్ను అర్థం చేసుకోలేదు. గత రెండేళ్లుగా దైవచింతనలో ఉన్నాను. నాకు కోపం ఎక్కువ.. ఇగో ఎక్కువ.. వాటిని నేను ఎంత వరకూ కంట్రోల్ చేసుకోగల్గుతాన్నానో తెలుసుకోవాలనిపించింది. నాకు సీజన్ 3 నుంచి ఆఫర్ వస్తూనే ఉంది. చివరకు మా గురువు గారు చెప్పడంతో వెళ్లాను. నేను లోపల ఉన్నప్పుడు నా గురించి వస్తున్న కామెంట్స్ విని..
వీళ్లకు నా పర్సనాలిటీ గురించి తెలియడం లేదా ? బయటకు వెళ్తుందో అన్న భయం ఉండేది. కానీ నా గురించి అంతగా నెగిటివ్ కామెంట్స్ రాలేదు. బయటకు మాత్రం మంచి పేరుతోనే వచ్చాను. కొన్నిసార్లు నేను కంట్రోల్ తప్పాను. ఎమోషనల్ గా వీక్ కావడం వల్ల నేను జెన్యూన్ గా అక్కడ సపోర్ట్ చేసేవాళ్లు ఉండరు. బిగ్బాస్ హౌస్ లో పీరయడ్స్ వచ్చినప్పుడు.. పీరియడ్స్ రావడానికి ఐదు రోజుల ముందు హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ జరిగాయి. నా ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంచుకోవాలన్నదే నా మెయిన్ అజెండా. అందుకే ప్రయత్నించాను” అంటూ చెప్పుకొచ్చింది.