విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత విశాల్ బయట కనిపించి చాలా కాలమే అయ్యింది. తాజాగా విశాల్ నటించిన 12 ఏళ్ళ క్రితం నాటి సినిమా ‘మదగజరాజ’ ఈ సంక్రాంతికి విడుదల కాబోతుంది. అయితే విశాల్ ని చూసిన అందరికీ ఊహించని షాక్. విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయాడు.
బాగా సన్నగా అయిపోయిన విశాల్ వేదికపై వణికిపోతూ కనిపించాడు. ముఖం కూడా మారిపోయింది. దీనితో విశాల్ ఆరోగ్యం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాల్ కి ఏమైంది.. ఎందుకు అలా వణికిపోతున్నారు అంటూ ఆరా తీస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు విశాల్ హై ఫీవర్ తో భాదపడుతున్నారట. ఫీవర్ కారణంగానే విశాల్ సన్నగా మారినట్లు తెలుస్తోంది.
నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. కేవలం ఫీవర్ కారణంగానే విశాల్ ఇలా మారాడా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా విశాల్ త్వరగా కోలుకుని మునిపటిలా యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. సుందర్ దర్శకత్వంలో మదగజరాజా చిత్రం తెరకెక్కింది.
Take care vishal naa y hand ivolo nadungudhu?🥲 #MadhaGajaRaja pic.twitter.com/LLHjhDFKHp
— Sanjayrant/alterego (@as_rantts) January 5, 2025