ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన చిత్రం ‘మదగజరాజ’. 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను 12 ఏండ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్ లో విశాల్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. ఉన్నట్లుండి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు విశాల్.
బాగా బక్కచిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశాల్ కు ఏమైందోనని తెగ కంగారు పడ్డారు. అయితే దీని పై వైద్యులు, పలువురు సినీ ప్రముఖులు క్లారిటీ ఇచ్చారు. విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. డెంగ్యూ జ్వరంతో విశాల్ బాధపడుతున్నారని అందుకే ఆయన అనారోగ్యంగా కనిపించారని తెలిపారు.
తన సినిమా దాదాపు 12ఏళ్ల తర్వాత విడుదల కావడంతో ఆరోగ్యం సహకరించకపోయినా విశాల్ ప్రెస్ మీట్ కు వచ్చారని నటి ఖుష్బూ తెలిపారు. ఇదిలా ఉంటే తాజగా విశాల్ సినిమా ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలు విశాల్ పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పటిలానే సూపర్ స్టైలిష్ గా కనిపించారు విశాల్. దాంతో విశాల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#MadhaGajaRaja – #Vishal's emotional speech🥺♥️
— AmuthaBharathi (@CinemaWithAB) January 11, 2025
"I will overcome any obstacles with my strength✌️. Now I'm perfectly alright, i don't have any trembling issues now🤝. I will never forget the love you have have shown me till the death. Love you all🫶" pic.twitter.com/D0ewPpIi3j