హీరో విశాల్.. తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక విశాల్ సినిమాలతో పాటు పెళ్లి గురించి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో విశాల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. కానీ ఆతర్వాత అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆతర్వాత పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. మొన్నామధ్య నటి అభినయాను విశాల్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. అయితే తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక.
ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగా 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. అందం అభినయం ఉన్న ధన్సికాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.

ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా క్రేజ్ రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. ఇక ఇప్పుడు విశాల్ ను పెళ్లి చేసుకోబోతుంది సాయి ధన్సిక. విశాల్ వయసు 47, ధన్సిక వయసు 35 ఏళ్ల. ఇద్దరి మధ్య 12 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉంది.