భారత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇటీవల ఓ ఆధ్యాత్మిక ప్రాంతాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ భారత్ లో అడుగుపెట్టిన తర్వాత తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ తో కలిసి ఉత్తరాప్రదేశ్ లోని బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించాడు.
అయితే పిల్లలు అకాయ్, వామికతో కలిసి విరుష్క దంపతులు శ్రీ ప్రేమానంద్ గోవింద్‌శరణ్ జీ మహారాజ్‌ని కలిశారు. వారితో శ్రీప్రేమాణంద్ గోవింద్ శరణ్‌జీ మహారాజ్ ఆప్యాయంగా మాట్లాడారు. సుఖసంతోషాలతో, ప్రేమతో ఉండాలని ఆశీర్వదించారు. విరుష్క దంపతులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరుష్క దంపతులు గతంలో అనేకసార్లు శ్రీప్రేమానంద్ గోవింద్‌శరణ్‌జీ మహారాజ్‌ను కలిశారు.
తన ఆటతో కోహ్లీ దేశానికి సంతోషం పంచుతున్నారు. అతను గెలిస్తే దేశం అంతా సంతోషంగా ఉంటుంది.అతడిని ప్రజలు అంతలా ప్రేమిస్తున్నారు. అందుకే కోహ్లీ తన పిల్లలను మీడియాకు దూరంగా, స్వేచ్ఛగా పెంచాలనుకుంటున్నారు. అందుకే పిల్లల గోప్యత విషయంలో జాగ్రత్తగా ఉంటారు విరుష్క దంపతులు. సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేసినప్పుడు ముఖాలు కనిపించకుండా ఈమోజీలు ఉంచుతారు.
అయితే తాజాగా ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహరాజ్‌ని సందర్శించి వెళ్తున్నప్పుడు విరాట్ కోహ్లీ–అనుస్క దంపతుల పిల్లలు ముఖాలు రివీల్ అయ్యాయి.
Virat Kohli और Anushka Sharma की पूज्य महाराज जी से क्या वार्ता हुई ? Bhajan Marg pic.twitter.com/WyKxChE8mC
— Bhajan Marg (@RadhaKeliKunj) January 10, 2025