భారత్ లో కేసులు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.. HMPV వైరస్ కేసులతో దేశంలో మళ్లీ లాక్ డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా చాలా మంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ కేసులు పెరుగుతున్న తీరుపై సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో Lockdown టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. అయితే చైనా నుండి వచ్చిన కొత్త వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి కొత్త మహమ్మారి వస్తుందనే భయం అందరిలో నెలకొంది. చైనా తర్వాత భారతదేశంలో HMPV గుర్తించారు. ఇక్కడ రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రెండు కేసులు కర్నాటకలో నమోదవడం గమనార్హం. మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి. ఈ వైరస్ ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే, చికిత్స చేయడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కోవిడ్-19 లాగా, దీనికి వ్యాక్సిన్ లేదా మందు కనుగొనబడలేదు. ప్రస్తుతం, చైనాలో శ్వాసకోశ సమస్యల కారణంగా ప్రజలు రోజురోజుకు ఆసుపత్రులలో చేరుతున్నారు. బహుళ వైరస్ ఇన్ఫెక్షన్లు రావడంతో చాలా మంది చనిపోతున్నారు. అందువల్ల, నిపుణులు ప్రారంభం నుండే సబ్బుతో చేతులు కడుక్కోవాలని, బట్టలు ఉతకాలని మరియు మాస్క్‌లు వాడాలని పదే పదే సూచిస్తున్నారు.
కరోనాకు ఎలాంటి జాగ్రత్తలు పాటించామో వీటికి కూడా అలాంటి జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. పిల్లలు మరియు కౌమారదశలో ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వైరస్ యొక్క ఈ రూపాన్ని చూసి, జపాన్ ఇప్పటికే అప్రమత్తమైంది. జపాన్‌లో 7 లక్షలకు పైగా ఇన్ఫెక్ట్ అయ్యారు. పిల్లలకు జలుబు, దగ్గు మరియు ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) సాధారణంగా తేలికపాటి లక్షణాలతో కనిపిస్తుంది,
వీటిలో:- దగ్గు, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, గొంతునొప్పి, జ్వరం. అయితే, కొన్ని సందర్భాల్లో HMPV తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది, ఇవి:- ఊపిరి పీల్చడంలో కష్టం, వీజింగ్, గొంతు నొప్పి, న్యుమోనియా, పెద్దవారిలో ఆస్తమా తీవ్రత పెరగడం, 1 సంవత్సరంలోపు చిన్నారులు, వృద్ధులు మరియు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో HMPV మరింత తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది.