కాన్సర్ట్ లో తనతో సెల్ఫీలు తీసుకోడానికి వచ్చిన లేడీ ఫ్యాన్స్ ను ముద్దు పెట్టుకోవడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఆయన తీరును తప్పు పట్టారు. దీనిపై స్టార్ సింగర్ ఇప్పటికే స్పందించారు. అభిమానులతో ఆ విధంగా ప్రవర్తించినందుకు ఏమాత్రం బాధపడటం లేదని అన్నారు. వారిపై ఉన్న ప్రేమను తెలియజేయడానికే అలా చేశానంటూ కిస్ చేయడాన్ని సమర్థించుకున్నారు. అయితే కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ స్టార్ సింగర్ తీరును తప్పు పట్టారు.
తనపై వస్తోన్న విమర్శలపై స్పందించిన ముద్దు పెట్టే విషయంలో తనకు వేరే ఉద్దేశం లేదన్నారు. అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేసేందుకే అలా చేశానంటూ చెప్పుకొచ్చారు. అయినా ఉదిత్ పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు ఈ స్టార్ సింగర్ కు సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉదిత్ నారాయణ్ వేదికపై పాడుతూ కనిపించారు. అదే సమయంలో కొందరు మహిళా అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు.
ఉదిత్ కూడా వారికి ఎంతో ఓపికగా ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చాడు. అదే సమయలో ఒక మహిళా అభిమాని చెంపపై ముద్దు పెట్టుకున్నాడు. అలాగే మరో అభిమాని పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది ఉదిత్ నారాయణ్‌ను విమర్శిస్తున్నారు.ఈ వీడియో చూసిన కొందరు ఉదిత్ నారాయణ తన తీరును మార్చుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది మీమ్స్ తయారు చేసి ‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఇమ్రాన్ హష్మీ’ అని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గతంలోనూ పలు సార్లు ఇలా తన ముద్దులతో వార్తల్లో నిలిచారు ఉదిత్. స్టార్ సింగర్స్ శ్రేయా ఘోషల్, అల్కా యాగ్నిక్ లను స్టేజ్ పైనే ముద్దు పెట్టుకుని విమర్శల పాలయ్యారీ స్టార్ సింగర్. ఇప్పుడు మళ్లీ ఇలా వార్తల్లో నిలుస్తున్నాడు.
Another video of Udit Narayan pic.twitter.com/dYGWgPfUHl
— Savage SiyaRam (@SavageSiyaram) February 5, 2025