గాయకుడిగా ఉదిత్ నారాయణ్ చేసిన సేవకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మశ్రీ వంటి అవార్డులతో సత్కరించింది. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు పడ్డ ఆయన.. 1980 లో యునిక్ పీస్ సినిమాతో బాలీవుడ్ లో గాయకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఉదిత్ నారాయణ్ ఈ కన్సర్ట్‌లో ‘టిప్ టిప్ బర్సా పానీ’ అనే పాటను ఆలపించారు. ఆ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి మహిళా అభిమానులు వేదికకు దగ్గరకు వెళ్లారు.
ఆయన వేదికపై పాట పాడుతూనే వారి దగ్గరికి వెళ్లి సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలోనే ఉదిత్ నారాయణ్ ముగ్గురు మహిళా అభిమానుల బుగ్గలపై ముద్దు పెట్టారు. ఆయన అలా ఒక్కసారిగా ముద్దులు పెట్టడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అంతటితో ఆగకుండా ఓ అభిమాని పెదవులపై కూడా ఆయన ముద్దు పెట్టడం వీడియోలో చూడొచ్చు. ఈ కన్సర్ట్ తాలూకు వీడియో బయటకు రావడం, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు.
ఉదిత్ నారాయణ్ మహిళా అభిమానులతో ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఇలాంటివి కొత్తేం కాదని, గతంలోనూ ఇలాగే ప్రవర్తించారని కామెంట్లు చేస్తున్నారు. “ఇది అసహ్యకరం. క్యా తర్కీ ఆద్మీ హై యార్” అని ఒకరు, “ఉదిత్ నారాయణ్ ది లెజెండ్ కూడా ఉడిత్ నారాయణ్ ది గ్రేట్ తార్కి అని అనుకోలేదు..!” అని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే, తన చర్యలపై నెటిజన్లు చేసిన వ్యాఖ్యలపై ఉదిత్ నారాయణ్ ఇంకా స్పందించలేదు.
Lol😭
— Ghar Ke Kalesh (@gharkekalesh) January 31, 2025
pic.twitter.com/bIVc4VJr2d