Viral Video: అటల్ సేతుపై నుంచి సముద్రంలోకి దూకేందుకు మహిళ ప్రయత్నం. ఈ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!
Viral Video: ఓ మహిళ క్యాబ్‌లో అటల్ సేతు మీదుగా ప్రయాణం చేస్తున్నది. కారును వంతెన వద్ద ఆపాలని చెప్పింది. సముద్రంలో మతపరమైన చిత్రాలను నిమజ్జనం చేస్తానని చెప్పి అటల్ సేతు వంతెన దగ్గర కారును ఆపాలని ములుంద్‌కు చెందిన మహిళ క్యాబ్ డ్రైవర్ సంజయ్ యాదవ్‌ను కోరింది. అయితే ఓ మహిళ(57), ముంబైలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ట్రాన్స్ హార్బర్ లింక్ బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆ మహిళ సముద్రంలో పడిపోబోతుండగా, ఒక ట్యాక్సీ డ్రైవర్ వెంటనే ఆమె జుట్టు పట్టుకుని ఆపాడు.
Also Read: తారకరత్న భార్య బర్త్‌డేని సెలెబ్రేట్ చేసిన వైఎస్ షర్మిల.! ఎమోషనల్ అయిన అలేఖ్య.
అప్పుడే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆమెను ధైర్యంగా కాపాడారు. ఈ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ నవ శేవాలో ఉంది. బ్రిడ్జికి సమీపంలో ఇన్‌స్టాల్ చేసిన ఒక సీసీటీవీ కెమెరాలో ఆ మహిళలకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.మహిళ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని తెలియగానే, పోలీసులు ఒక వాహనంలో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు ఆమె తడబడి సముద్రంలో పడిపోబోతుంది. కానీ ఒక ట్యాక్సీ డ్రైవర్ వెంటనే ఆమె జుట్టుపట్టుకుని ఆపాడు. గాల్లో వేలాడుతున్న ఆమెను, అప్పుడే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు రక్షించారు.
Also Read: షేక్ హసీనా ఇంట్లో పిల్లి దొంగతనం..! ఆ పిల్లి ఖరీదు ఎంతో తెలుసా..?
ఈ విషయాన్ని ఒక పోలీస్ అధికారి PTI వార్తా సంస్థకు తెలిపారు. పోలీసుల ప్రకారం, ఈ సంఘటన సాయంత్రం 7 గంటల సమయంలో జరిగింది. ములుండ్ నుంచి వచ్చిన ఆ మహిళ ట్యాక్సీ డ్రైవర్ సంజయ్ యాదవ్ (31)ను వంతెన మీద కారు ఆపమని అడిగింది. తర్వాత వీడియోలో కనిపించినట్లుగా ఆ మహిళ అటల్ సేతు మీద ఉన్న సేఫ్టీ బారియర్‌పై కూర్చుని, ఏదో ఒక వస్తువును సముద్రంలోకి విసిరింది. అక్కడకు చేరుకున్న పోలీసులను చూసిన వెంటనే ఆ మహిళ సముద్రంలోకి దూకబోయింది. కానీ ట్యాక్సీ డ్రైవర్ ఆమె జుట్టు పట్టుకుని కాపాడాడు. పోలీసు కానిస్టేబుళ్లు లలిత్ అమర్‌షెట్, కిరణ్ మాత్రే, యశ్ సోనావణే కూడా బ్రిడ్జి రైలింగ్ దాటి వెళ్లి ఆ మహిళను పట్టుకుని కాపాడారు.
Viewers Discretion Advised
— पोलीस आयुक्त, बृहन्मुंबई – CP Mumbai Police (@CPMumbaiPolice) August 16, 2024
Responding promptly to an attempt to die by suicide at MTHL Atal Setu, the on-duty officials, PN Lalit Shirsat, PN Kiran Mahtre, PC Yash Sonawane & PC Mayur Patil of @Navimumpolice jumped over the railing & rescued the individual saving her life.
I… pic.twitter.com/h9JYayucLk