ఈ వ్యక్తి అసలు ఏ పని చేయకుండా.. ఏడాదికి 69 లక్షలు సపదిస్తున్నాడు. ఎలానో తెలుసుకోండి.

divyaamedia@gmail.com
2 Min Read

ఏమీ చేయకుండా డబ్బులు సంపాదిస్తున్న ఆ వ్యక్తి పేరు షోజి మొరిమొటో. వయసు 40 ఏండ్లు. ఇతడు రెంటల్ –డు- నథింగ్ అనే వ్యాపారాన్నిమొదలు పెట్టాడు. వ్యాపారం అంటే ఏదో కష్టపడి పని చేసేది కాదు. ఈ బిజినెస్ లో ఆయన ఏం చేస్తారంటే? అతడిని ఎవరైనా రెంట్ కు తీసుకోవచ్చు. అంటే, ఏదో పిచ్చి పనులు చేయడానికి కాదు. తనను బుక్ చేసుకున్న వారితో ఎలాంటి శారీరక సంబంధాన్ని పెట్టుకోడు. కేవలం అతడి సమయాన్ని మాత్రమే క్లయింట్ కోసం కేటాయిస్తాడు. అయితే 41 ఏళ్ల షోజీ ఎలాంటి శారీరక శ్రమ లేకుండా లక్షల్లో సంపాదీస్తున్న వ్యక్తిగా జపాన్‌లో ప్రసిద్ధి చెందాడు.

ఇది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న ఎవరి మదిలో అయిన తలెత్తవచ్చు. నిజానికి షోజీ ప్రత్యేక వ్యక్తిత్వమే అతని ఆదాయ వనరు. అలా ఎలా అని అనుకుంటున్నారా.. జపాన్‌లో ప్రత్యేకమైన అద్దె సేవా పరిశ్రమ ఉంది. అంటే ఎవరికైనా మంచి సహచరులు కావాలనుకుంటే అద్దెకు సహచరులను అందిస్తాది. షోజీ కూడా ఈ సేవ సంస్థలో సభ్యుడు. షోజీ మాట్లాడే విధానం చాలా పవర్‌ఫుల్‌గా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. దీంతో అతనితో సమయం గడపడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు.

2018లో ఏ పని చేయడం లేదంటూ షోజీని ఉద్యోగం నుంచి తీసేశారు. అప్పుడు అతను ఈ అద్దె సేవా సంస్థలో సభ్యుడిగా మారాడు. షోజీ మాటల్లో అపరిచితుడు కూడా చాలా త్వరగా అతుక్కుపోయేంత మ్యాజిక్ ఉంటుందని చెబుతున్నారు. ఈ గుణమే అతడిని అద్దె సేవల ప్రపంచంలో విశేష ప్రాచుర్యం తీసుకొచ్చింది. షోజీ ప్రజలను కలవడం లేదా వారితో మాట్లాడడం ద్వారా డబ్బు తీసుకోవడమే కాదు.. ప్రతిరోజూ తన మొబైల్‌ ద్వారా 1000 మందికి పైగా అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ కూడా అందుకుంటాడు.

షోజీ కేవలం వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఒక సంవత్సరంలో 80,000 డాలర్లు (అంటే సుమారు రూ. 69 లక్షలు) సంపాదించాడు. ఎవరైనా విచారంగా ఉన్నప్పుడు.. వారిని ఓదార్చగల వ్యక్తి అవసరం అని అతను చెబుతాడు. అలా ఓదార్పు అవసరం అనుకున్న వ్యక్తులు షోజీని కలుసుకుని తమ భావాలను పంచుకుంటారు. అప్పుడు షోజీతో మాట్లాడిన తర్వాత మనసు తెలికినట్లు భావిస్తారు. అందుకనే అంతగా అతనికి డిమాండ్ ఉంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *