Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అప్పీల్ పై తీర్పు పదే పదే వాయిదా వేయడానికి కారణమేంటంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అప్పీల్ పై తీర్పు పదే పదే వాయిదా వేయడానికి కారణమేంటంటే..?

Vinesh Phogat: ఒలింపిక్స్‌లో భారత రెజర్ల వినేశ్ ఫోగట్ ఫైనల్ చేరారు. ఫైనల్ జరిగే కొన్ని గంటల ముందు ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. బరువు పెరిగినందుకు చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. దాంతో యావత్ భారతదేశం నిరాశకు గురయ్యింది. తనకు జరిగిన అన్యాయాన్ని వినేశ్ ఫోగట్ కాస్‌లో అప్పీల్ చేశారు. ఫోగట్ తరఫున ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. అయితే భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అప్పీల్ పై తీర్పు మరోసారి వాయిది పడింది.

Also Read: స్నాప్ చాట్ వాడుతున్నారా..! స్క్రీన్ షాట్ తీయడం చాలా ఈజీ.

ఆగష్టు 16న తీర్పు వెల్లడిస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తెలిపింది. వినేష్ ఫోగట్‌కు రజత పతకం ఇస్తారా లేదా అనేది స్పోర్ట్స్ కోర్టు నిర్ణయించనుంది. కాగా.. దీనిపై ఇప్పటికే విచారణ పూర్తయింది. ముందుగా ఆగస్టు 10న నిర్ణయం వెలువడుతుందని అనుకున్నప్పటికీ.. ఆగస్టు 13కి వాయిదా వేశారు. కాగా.. ఈరోజు తీర్పు వస్తుందని భారతదేశ ప్రజలు ఉత్కంఠతో చూస్తుండగా.. ఈ సస్పెన్స్ అలానే కంటిన్యూ అవుతుంది. ఆగస్టు 16న తీర్పు వెలువడనుంది. కాగా.. రెజ్లింగ్ ఫైనల్ కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో IOC ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.

Also Read: మీరు పడుకునే స్థితిని బట్టి మీరు ఎలాంటివారో తెలుస్తుంది.

ఈ క్రమంలో.. తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేసింది. ఇదిలా ఉంటే.. వినేష్‌కు క్రీడా రంగంలోని పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. వీరిలో జపాన్‌కు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ రెజ్లర్ హిగుచి రే, అమెరికా రెజ్లర్ జోర్డాన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంటి కొందరు దిగ్గజాలు ఆమెకు సపోర్ట్ చేశారు. మరి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *