Vijayakumar: ఈ సీనియర్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కొడుకులు, కూతుర్లు, హీరో హీరోయిన్ లని మీకు తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

Vijayakumar: ఈ సీనియర్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కొడుకులు, కూతుర్లు, హీరో హీరోయిన్ లని మీకు తెలుసా..?

Vijayakumar: విజయ కుమార్ తమిళనాడులోని తంజావూరు జిల్లా, పట్టుకోట్టై తాలూకా, నట్టుచాలై అనే ఊళ్ళో రంగసామి, చిన్నమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు పంచాక్షరం. సినిమాల కోసం విజయ కుమార్ గా మార్చుకున్నాడు. అయితే ఇండియన్ సినిమా హిస్టరీలో మోస్ట్ టాలెంటెడ్ నటుల లిస్ట్ తీస్తే.. అందులో ఖచ్చితంగా ఉండే పేరు విజయ్ కుమార్. అసలు ఈ నటుడు ఒక రెండు దశాబ్దాల కిందట మాములు బిజీగా ఉండేవాడు కాదు. ఏడాదికి కనీసం పది, పదిహేను సినిమాలు చేశాడు. అలా దాదాపు 6 దశాబ్దాల పాటు.. ఎన్నో వందల సినిమాల్లో నటించాడు.

Also Read: డెడ్ పూల్ డాన్స్ తో దుమ్మురేపిన నభా నటేశ్, వైరల్ అవుతున్న వీడియో.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ ఇలా సౌత్‌లోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేశాడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి పనిచేశాడు. స్నేహం కోసం సినిమాలో చిరంజీవి ప్రాణ స్నేహితుడిగా నటించింది ఆయనే. వాసులో వెంకటేష్ ఫాదర్‌గా.. సాంబలో ఎన్టీఆర్ తండ్రిగా.. ఇలా దాదాపు తెలుగులో 40కి పైగా సినిమాల్లో నటించాడు. ఆయన మాత్రమే కాదు.. ఆయన కొడుకు, కూతుళ్లు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఆయన కొడుకు కూడా ఒకడు. ఆయన కొడుకు మరెవరో కాదు అరుణ్ విజయ్.

సాహో సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా నటించింది ఆయనే. అంతకు ముందు రామ్ చరణ్ బ్రూస్‌లీ సినిమాలో కూడా నటించాడు. ఇక విజయ్ కుమార్ కూతుళ్లు కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్‌లే. ఆయన కూతురు ప్రీతా విజయ్ కుమార్.. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. రుక్మిణి అనే సినిమాలో హీరోయిన్‌గా ప్రీతా విజయ్ కుమార్ నటించింది. ఆ తర్వాత మా అన్నయ్య సినిమాలో కూడా ప్రీతా విజయ్ కుమార్ నటించింది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు వంటి సినిమాల్లో కూడా ప్రీతా విజయ్ కుమార్ నటించింది.

Also Read: ఆ హీరోయిన్ రోజూ తన గదికి వస్తోందని శోభన్ బాబు ఏం చేశారో తెలుసా..?

ఇక రెండో కూతురు శ్రీదేవి.. ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్‌లో హీరోయిన్‌గా నటించింది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ వంటి సినిమాల్లో మెరిసింది. రవితేజ హీరోగా నటించిన వీరా సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించింది. ఈ సినిమాలో రవన్న చెల్లెలిగా నటించింది. ఈ ముగ్గురే కాదు.. విజయ్ కుమార్ మూడో కూతురు కూడా తెలుగు సినిమాల్లో నటించింది. ఆమెనే వనితా విజయ్ కుమార్. ఈ బ్యూటీ దేవి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. నరేష్, పవిత్రల మళ్ళీ పెళ్ళి సినిమాలో కూడా నటించింది.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *