విజయ్ దేవరకొండ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా, జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి వద్ద ఈ ఘటన జరిగింది. విజయ్ కారును ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టింది. అయితే విజయ్ దేవరకొండ కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది.
అయితే ఈ ప్రమాదం నుంచి విజయ్ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదంలో విజయ్ కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదం తర్వాత విజయ్ తన స్నేహితుడి కారులో హైదరాబాద్ వెళ్లిపోయాడు. కాగా ఇటీవల రష్మికతో విజయ్ దేవరకొండ ఎంగేజ్ మెంట్ జరిగినట్లు ప్రచారం జరిగింది.

నిశ్చితార్థం తర్వాత అతను పుట్టపర్తికి వెళ్లాడు. అక్కడ సత్యసాయి సమాధిని దర్శించుకున్నాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ప్రమాదంలో విజయ్ దేవరకొండ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విజయ్ దేవరకొండ రెండు రోజుల క్రితమే హీరోయిన్ రష్మికను నిశ్చితార్థం చేసుకున్నారు.రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటం అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.