జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంట్లో నేడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేణు స్వామి తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా వేణు స్వామి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన ఫాలోయర్స్ కు తెలిపారు. అయితే వేణు స్వామి వ్యక్తి గత జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేణు స్వామి తల్లి పరాంకుశం విజయ లక్ష్మి శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వామీజీనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
‘మా అమ్మ గారు శ్రీమతి పరాంకుశం విజయ లక్ష్మి గారు ఈరోజు ఉదయం పరమపదించారు (మరణించారు)’ అంటూ సోషల్ మీడియాలో తన తల్లి ఫొటోను షేర్ చేశారు వేణు స్వామి. దీంతో పలువురు ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. వేణు స్వామి తల్లి ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి ఇటీవల తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసిందామె.. ‘పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది రచ్చ రచ్చ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. రాజకీయ నాయకుల సంగతి పక్కన బెడితే.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఓవర్ యాక్టింగ్ మామూలుగా చేయలేదు? వీళ్లు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు.
ఇప్పుడు వారంతా ఏం చేస్తారు. మీరు నిజమైన హిందువులైతే.. వెంకటేశ్వరస్వామి భక్తులైతే.. మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాను’ అని చెప్పుకొచ్చింది వీణా శ్రీవాణి.