వేణుస్వామిని గుడి నుంచి తరిమేసిన అర్చకులు..! ఎందుకో తెలుసా..? వీడియో వైరల్.

divyaamedia@gmail.com
2 Min Read

జ్యోతిష్యుడు వేణు స్వామి తరచుగా ఏదో ఒక అంశంతో వార్తలలో ఉంటారు. ముఖ్యంగా ఆయన తరచుగా సెలబ్రీటీల జాతకం చెబుతూ రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా ఆయన సమంత, నాగచైతన్య డైవర్స్ పై ఆయన చెప్పిన జాతకంతో ఒక రేంజ్లో ఫెమస్ అయ్యారు. అయితే అస్సాంలోని కామాఖ్యా ఆయలయం గురించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

సంతానం లేనివారు కామాఖ్యా అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే.. ఏడాదిలోపు పిల్లలు పుడతారని, అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పిస్తారని ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వేణుస్వామికి షాకింగ్ ఘటన ఎదురైంది. తాజాగా ఆయన అస్సాంలోని కామాఖ్యా దేవి ఆలయానికి సందర్శించుకోవడనికి వెళ్లగా.. అక్కడి పండితులు అతడిని లోపాలికి వెళ్లనివ్వలేదు. దేవాలయం నుంచి బయటకు పంపించేసినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొద్దిరోజులుగా నీ బాగోతం అంతా చూస్తున్నాం అంటూ అక్కడి పండితులు వేణుస్వామిని అడ్డుకున్నారు. కామాఖ్యా అమ్మవారి ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడుతున్నావు! నీ లాంటి దొంగ స్వామీజీలను మేము నమ్మము అంటూ బయటకు పంపించేశారు. ఈ మేరకు గుడి పండితులు మాట్లాడుతూ.. కామాఖ్య గుడిలో దోషనివారణ పూజలు అంటూ ఈయన లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు.

ఎవరైనా ఏదైనా పూజలు, హోమాలు చేయించుకోవాలనుకుంటే నేరుగా మమల్ని కలవండి. ఈయన చేసే పూజలు.. మేం కూడా చేస్తాం. లక్షలు ఖర్చయ్యే పూజలు ఇక్కడ ఏమీ లేవు . తక్కువ ఖర్చుతోనే మీకు కావాల్సిన పూజలన్నీ చేస్తాం. ఇలాంటి వారి మాటలు నమ్మకండి అంటూ వేణుస్వామిని నమ్మి మోసపోయిన వారి కళ్ళు తెరిపించారు పండితులు. జ్యోతిష్యుడు వేణుస్వామి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జీవితాల గురించి జ్యోతిష్యం చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

ఆ హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకుంటే విడిపోతారు, ఈ హీరో సినిమా ప్లాప్ అవుతుంది, పలనా రాజకీయ నాయకుడికి దోషాలు ఉన్నాయి అంటూ ప్రముఖుల పేర్లు నేరుగా ప్రస్తావిస్తు వివాదాస్పద జ్యోతిష్యం చెబుతుంటారు. సమంత- నాగచైతన్య విడాకుల వ్యవహారంతో పాపులరైన వేణుస్వామి.. ఆ తర్వాత చాలా మంది సెలబ్రెటీల జాతకాలు గురించి బహిరంగంగా మాట్లాడారు.

జ్యోతిష్యం మాత్రమే కాకుండా దోష నివారణ అంటూ సెలబ్రెటీలు చేత పూజలు కూడా చేయిస్తుంటారు వేణుస్వామి. ఇటీవలే బుల్లితెర నటి అషు రెడ్డితో పూజలు చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *