ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి అనగానే అందరికీ గుర్తొచ్చేవి సెలబ్రిటీల జాతకాలు. సినీ నటుల జాతకాలు పబ్లిక్ గా చెబుతూ ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఇటీవలి కాలంలో అయితే నెట్టింట ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. అయితే తేలుగు రాష్ట్రాల్లో తన జాతకాలతో అతి తక్కువ కాలంలో చాలా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఇతరుల జాతకాలు చెప్పడంలో బిజీగా ఈయన పండితుడు తన జాతకం చూసుకోవడం మర్చిపోయినట్టున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ తర్వాత ..వాళ్లిద్దరు కలిసి ఉండలేరు.
పెళ్లి తర్వాత విడిపోతారు అని కామెంట్స్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. మంచి ఉంటే పది మందిలో చెప్పాలంటారు. చెడును మాత్రం చెవిలో చెప్పమని మన పెద్దలు చెబుతుంటారు. దాన్ని విస్మరించిన ఈ పండితుడ మహాశయుడు.. అతితో అసలు వాళ్లు అడక్కపోయినా.. వాళ్ల జాతకంలో ఏదో తేడా ఉందని చెప్పడంతోనే ఈ రచ్చ మొదలైంది. వేణు పరాంకుశం స్వామి పై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు తన ముందు హాజరు కావాలని గతం లో వేణుని ఆదేశించిన మహిళా కమిషన్.మహిళా కమిషన్ కు ఆ అధికారం లేదంటూ స్టే తెచ్చుకున్న వేణు స్వామి.
ఈ రోజు ఆ స్టే ఎత్తివేస్తూ మహిళా కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని పేర్కొంటూ హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వారం రోజుల్లో వేణు స్వామిపై తదుపరి చర్యలు తీసుకోమని కమిషన్ ను ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. అప్పట్లో నాగ చైతన్య, సమంత మ్యారేజ్ తర్వాత వారి జాతకాల ప్రకారం వారిద్దరు ఎక్కువ కాలం కలిసి జీవించలేరు. వారు విడాకులు తీసుకుంటారని చెప్పారు. ఆ తర్వాత సామ్, చైతూ మధ్య ఏం జరిగిందో ఏమో వాళ్లిద్దరు విడిపోతున్నట్టు ప్రకటించి విడాకులు తీసుకున్నారు.
దీంతో తాను చెప్పిన మాట ప్రకారమే వాళ్లిద్దరు విడిపోయారంటూ పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యారు వేణు స్వామి. పండితుడిగా ఆయనకు మంచి విద్వత్తు ఉన్నా.. ఒకరు అడక్కముందే వారి జీవితాలను బజారు పెట్టడం వంటివి చేయడం మూలానా.. జ్యోతిష్య పండితుడు వేణు స్వామి ప్రజల్లో పలుచన అయ్యారు. తాజాగా ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఆయనపై విచారణ మొదలైంది. హై కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ ముందు హాజరవుతారా.. సుప్రీంకోర్టు వెళ్లి మళ్లీ ఈ విచారణపై స్టే తెచ్చుకుంటారా అనేది చూడాలి.