తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కొన్ని చిత్రాలలో నటించారు. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి ఈయన ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉండి, ఇప్పుడు సడన్గా వార్తల్లో నిలిచారని చెప్పవచ్చు. అయితే మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్’ సంస్థలో ప్రతినిధిగా ఉన్నాడు నటుడు వేణు.
ఈ సంస్థ గతంలో ఉత్తరాఖండ్‌లో జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) ద్వారా దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాయి. అయితే, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్యలోనే తప్పుకోవడంతో 2002లో రిత్విక్ సంస్థ పనులు మొదలుపెట్టింది.
ఇద సమయంలో రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో ఆ సంస్థ ఎండీ రవికృష్ణ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన ఫిర్యాులో పేర్కొన్నారు. తాజాగా నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వేణుతోపాటు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకులు భాస్కరరావు హేమలత, శ్రీవాణి, ఎండీ పాతూరి ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.