ఈ హీరోకి సినిమా అవకాశాలు రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

‘స్వయంవరం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వేణు ఆ తర్వాత కళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైన వేణు ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే హీరోగా దాదాపు 25-26 చిత్రాలలో నటించినట్లు వేణు గుర్తుచేసుకున్నారు. తన మొదటి చిత్రం స్వయంవరంతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని, కెరీర్ ప్రారంభంలోనే మంచి పికప్ సాధించినట్లు తెలిపారు.

చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే, చెప్పవే చిరుగాలి, గోపి గోపిక గోదావరి, సదా మీ సేవలో వంటి చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరై, తన నటనతో వారిని ఆకట్టుకున్నానని పేర్కొన్నారు. తన విజయానికి కారణం ప్రేక్షకులేనని, మంచి కంటెంట్‌ను ఇచ్చినందువల్లే వారు ఆదరించారని వేణు అన్నారు. అయితే, కెరీర్ మధ్యలో సక్సెస్ రేట్ తగ్గడంపై ప్రశ్నించగా, కొన్ని పొరపాట్లు జరిగాయని, అందుకే వెనకబడ్డాను అని అన్నారు వేణు.

కానీ గతాన్ని తవ్వుకోవడానికి ఇష్టపడనని, “గతం గతాః” అనేదే తన విధానమని అన్నారు వేణు. దమ్ము, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలలో ప్రత్యేక పాత్రలు పోషించినప్పటికీ, చింతకాయల రవి చిత్రంలో రెండు రోజుల అతిథి పాత్రను అసలు లెక్కలోకి తీసుకోనని తెలిపారు. ఇటీవల అతిథి వెబ్ సిరీస్‌తో తిరిగి నటనలోకి వచ్చిన వేణు, ఈ పాత్ర తనకు ఎంతో కొత్త అనుభూతిని ఇచ్చిందని, ఇలాంటి విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు.

ప్రస్తుతం ఒక కొత్త చిత్రంలో అంధుడి పాత్రను పోషిస్తున్నట్లు, ఈ చిత్రం కూడా త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఈ చిత్రానికి సూర్య అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారని, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారని చెప్పారు. పాత్రల ఎంపిక విషయంలో తన విధానాన్ని వివరిస్తూ, కేవలం మెయిన్ రోల్స్ చేయాలనే ఆలోచన లేదని, పాత్రలో డెప్త్, అర్ధవంతమైన విషయాలు ఉంటే పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో చాలా మంచి దశలో ఉందని, మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని, కేవలం నటించడానికి అన్నట్లుగా వెళ్లి సినిమాలు చేయనని స్పష్టం చేశారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *