2018లో సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా అంతగా కలిసిరాలేదు. ప్రస్తుతం నిధి చేతిలో రెండు భారీ ప్రాజెక్టులున్నాయి. పవన్ హరిహర వీరమల్లు ఈ నెల 24న విడుదల కానున్నది. ఇక ప్రభాస్ సరసన ‘రాజాసాబ్’ మూవీలో నటిస్తున్నది.
అయితే గతంలో రష్మిక మందన్నా, నిధి అగర్వాల్, డింపుల్ హయతి తదితర స్టార్ హీరోయిన్లు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అలాగే అషు రెడ్డి, ఇనాయా సుల్తానా, నిశ్విక నాయుడు తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా నిధి అగర్వాల్ మరోసారి వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఇదుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిధి అగర్వాల్ వేణు స్వామితో కనిపించడం ఇదేమీ మొదటి సారి కాదు. సుమారు రెండేళ్ల క్రితం కూడా వేణుస్వామితో పూజలు చేయించిందీ అందాల తార. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు బాగానే సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం నిధి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరముల సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ మూవీలోనూ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోది.
అయితే ఈ రెండు సినిమాలు షూటింగులు పూర్తి చేసుకున్నా విడుదల విషయంలో మాత్రం తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయతే హరి హర వీరమల్లు ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తన సినిమా సూపర్ హిట్ కావాలని నిధి వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.