Venu Swamy: మాకు ఆత్మహత్యే గతి అంటూ వేణు స్వామి దంపతుల సంచలన ఆరోపణలు.
Venu Swamy: నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం 2027 వరకు బాగానే ఉందని.. అక్కడి నుంచి వీరి వైవాహిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఓ మహిళ కారణంగా వీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వేణు స్వామి తెలిపారు. వీరు పెట్టుకున్న ఎంగేజ్మెంట్కు ముహూర్తం బలం, అలాగే జాతకం వీళ్లకు అనుకూలంగా లేవని వేణు స్వామి తేల్చేశారు. గతంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పినప్పటి వీడియో బైట్‌ను చూపించారు. అయితే సెలబ్రిటీలందరికి జాతకాలు చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి జాతకం రివర్స్ అయింది. అందరిలో నెగిటివ్ షేడ్స్, బ్యాడ్ వైబ్స్ ముందుగానే చెప్పే ఈ సెలబ్రిటీకి కొత్త చిక్కొచ్చి పడింది.
Also Read: వేణు స్వామి సంచలన నిర్ణయం, సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పను.
చివరకు మాకు ఆత్మహత్యే శరణ్యం అంటూ ఓ వీడిమాయోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వేణుస్వామి. అయితే అందరి ఫ్యూచర్ చెప్పే ఈ వేణుస్వామికి అంత కష్టం ఏమొచ్చిందో తెలియాలంటే ఆయన పోస్ట్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆయన షేర్ చేసిన వీడియోలో వేణుస్వామి సతీమణి వీణ శ్రీవాణి కూడా ఉన్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో పని చేస్తున్న జర్నలిస్ట్ తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని… రూ. 5కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ వీడియోలో ఆరోపణలు చేశారు వేణుస్వామి దంపతులు. ఇటీవలే నిశ్చితార్దం చేసుకున్న టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కాగానే విడిపోతారని జోస్యం చెప్పి వివాదాల్లో చిక్కుకున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.
ఈ చిక్కుల్లోంచి బయటపడక ముందే మరో వివాదానికి తెర తీశారు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో పెద్ద దుమారం రేపుతోంది. ఏ ప్రముఖ ఛానల్ లో పని చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ తనను 5. కోట్ల రూపాయలు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. ఆ బాధ నుంచి తట్టుకోలేకపోతున్నామని సంచలన ఆరోపణలు చేస్తూ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు వేణుస్వామి ఆయన సతీమణి వీణశ్రీవాణి. జర్నలిస్టుపై సంచలన ఆరోపణలు చేసిన వీడియో ఇదిగో. హీరో నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత విడిపోతారని చెప్పిన వేణుస్వామి అది వాస్తవం కావడంతో .. ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
Also Read: సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వేణు స్వామి ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..?
ఈ ఒక్క అంశాన్ని పట్టుకొని చాలా మంది సెలబ్రిటీల పర్సనల్ విషయాలపై జాతకాలు చెబుతూ వచ్చారు. చివరకు రాజకీయాల్లో కూడా ఆపార్టీ గెలుస్తుంది.. ఈపార్టీ ఓడిపోతుందని జోస్యం చెప్పి పొలిటికల్ గా కూడా కొంత మైలేజ్ సంపాదించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో, తెలంగాణలో ఆయన చెప్పినట్లుగా జరగకపోవడంతో ఇకపై రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు. తాజాగా నాగచైతన్య, ధూళిపాళ్ల నిశ్చితార్థం విషయంలో తలదూర్చి వివాదాల్లో చిక్కుకున్నారు వేణుస్వామి.