బ్లాక్ బస్టర్ కొట్టి.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన డైరెక్టర్‌ను గుర్తు పట్టారా..?

divyaamedia@gmail.com
1 Min Read

గతంలో వెంకీ అట్లూరి, నాగ్ అశ్విన్ , సందీప్ రెడ్డి వంగా వంటి ఎంతో మంది టాలీవుడ్ డైరెక్టర్లు తమ సినిమా రిలీజ్ లయ్యాక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుడికి తలనీలాలు సమర్పించి మొక్కులు కూడా తీర్చుకున్నాడు.

అలా ఇటీవల బ్లాక్ బస్టర్ కొట్టిన ఓ యంగ్ డైరెక్టర్ కూడా గురువారం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాడు. స్వామి వారికి మొక్కులు సమర్పించాడు. పై ఫొటోలో గుండుతో కనిపిస్తున్నది ఆ డైరెక్టరే. మరి అతనెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి.

అతను మరెవరో కాదు మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అందుకున్నాడు. కేవలం రూ. 60 కోట్లతో ఈ సినిమా తీస్తే రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది.

ఈ నేపథ్యంలోనే తన సినిమా విజయం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడీ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్. స్వామి వారికి తలనీలాలు సమర్పించాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *