రామ్ గోపాల్ వర్మ కు కుక్క బిస్కెట్స్ వేసిన శ్రీదేవి, దీంతో వర్మ ఏం చేసాడో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

శ్రీదేవి ఒక అగ్ర కథానాయక. ఆమె తన నట జీవితాన్ని బాల నటిగా కన్దన్ కరుణై (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టినది.ఐతే 1975 లో విజయచిత్ర అని ఒక తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తుణైవన్ అనే చిత్రం తన మొదటి తమిళ చిత్రం అని చెప్పింది. అయితే రామ్ గోపాల్ వర్మకు ఏంటి.. శ్రీదేవి ఏంటి.. కుక్క బిస్కెట్లు వేయడం ఏంటీ అని పెద్ద డౌట్ అందరికి రావచ్చు అయితే ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా వర్మనే.. శ్రీదేవి ముందే అన్నారు. ఇంతకీ ఆయన ఏ సంద్బంలో ఈమాట అన్నారోతెలుసా.

శ్రీదేవి మీద అభిమానాన్ని ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా తెలుపుకున్నారు రామ్ గోపాల్ వర్మ. అందులోభాగంగా ఓ కార్యక్రమంలో ఆయన ఈ మాటలు అన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వందసినిమాలకు సబంధించి ఈటీవిలో కార్యక్రమం ఒకటి వచ్చింది. అందులో ఒ ఎపిసోడ్ లో పాల్గొన్నారు రామ్ గోపాల్ వర్మ. వర్మతో పాటుగా శ్రీదేవి కూడా ఈ ఎపిసోడ్ లో ఉన్నారు. ఈక్రమంలోనే శ్రీదేవి కెరీర్ లో మంచి పేరు తెచ్చిన సినిమాలు.. ఆమెను నిలబెట్టిన టాలీవుడ్ సినిమాల గురించి హోస్ట్ సుమ శ్రీదేవిని ప్రశ్నించారు.

దానికి శ్రీదేవి ఇచ్చిన ఆన్సర్ తో రామ్ గోపాల్ వర్మ ఈ కామెంట్స్ చేశారు. శ్రీదేవి ఏమన్నారంటే.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తన కెరీర్ లో అద్భుతం అని అన్నారు. దాంతో పాటు మరికొన్ని సినమాల పేర్లు చెప్పిన శ్రీదేవి.. చివరిగా క్షణం క్షణం సినిమా కూడా తన కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. దాంతో అలిగిన ఆర్జీవి… ఏదో కంటితుడుపుగా అంటున్నారు. కుక్కు బిస్కెట్ వేసినట్టు.. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి.. కావాలని అలా అంటున్నారు అని అన్నారు. దానికి శ్రీదేవి తో పాటు… అక్కడే ఉన్న రాఘవేంద్రరావు కూడా సమాధానం చెపుతూ.. అదేం లేదు.

ఆసినిమా ఎంత హిట్ అయ్యింది. అప్పట్లో ఎంత అద్భుతం క్రియేట్ చేసింది అనే విషయం అందిరిక తెలుసు అన్నారు. దాంతో అంతా నవ్వుకున్నారు. ఈరకంగా శ్రీదేవిని నాకు కుక్క బిస్కెట్స్ వేస్తున్నారు అని ఆర్జీవి అన్నారు. రామ్ గోపాల్ వర్మకు హీరోయిన్ శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతపెద్ద దర్శకుడు శ్రీదేవికి వీరాభిమాని.. శ్రీదేవి అంటే తనకు ఎంత అభిమానమో.. చాలా సందర్భాల్లో ఆయన వెల్లడించారు కూడా. ఒక రకంగా ఆమెను ప్రేమిస్తూ.. ఆరాధిస్తుంటాడు ఆర్జీవి. ఆమె అంటే ఎంత ప్రాణం అంటే.. ఎవరైనా శ్రీదేవిని ఏమైనా అంటే అస్సులు ఊరుకునేవాడు కాదట. ఆమెను అంతలా అభిమానిస్తారు రామ్ గోపాలు వర్మ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *