స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు దాదాపు ఫోన్ పే, గూగుల్ పేలను యూజ్ చేస్తున్నారు. అయితే పేమెంట్ చేసే సమయంలో ఒక్కోసారి డబ్బులు ఒకరికి పంపబోయి మరొకరికి పంపుతుంటారు. తెలిసిన వారికి పంపిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. తిరిగి మళ్లీ పంపించమని అడగొచ్చు. అదే తెలియని వ్యక్తులకు పంపిస్తే మాత్రం డబ్బులు తిరిగి పొందేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అయితే ప్రస్తుతం ప్రభుత్వం యు.పి.ఐ పేమెంట్స్ ను 5 లక్షల ఆకా పెంచడం జరిగింది. ఇది వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. గతంలో యు.పి.ఐ ట్రాన్ సాక్షన్ గరిష్ట మొత్తం కేవలం 1 లక్ష మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ లావాదేవీలను 5 లక్షల దాకా పొడిగించారు. ఈ పెరిగిన పరిమితి నిర్ధిష్ట ఫీల్డ్ లో వారికి మాత్రమే అని తెలుస్తుంది.
5 లక్షల యుపిఐ చెల్లింపు పరిమితి కింది వర్గాలకు మాత్రమే ఇస్తారు. అందులో పన్ను చెల్లింపులు, విద్యా సంస్థల పేమెంట్స్, ఐ.పి.ఓ, హాస్పిటల్ బిల్లులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రిటైల్ ట్రాన్సాక్షన్ సిస్టం ఇలాంటి కేటగిరిల్లో యు.పి.ఐ సిస్టం అధిక విలువ లావాదేవీలు చేసే అవకాశం ఇస్తున్నారు. ఈ మార్పుల ద్వారా ఎంతోమంది వినియోగదారులకు యు.పి.ఐ లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి.
ఇండియాను నగదు రహిత ఆర్ధిక వ్యవస్థగ మార్చాలనే మోడీ ప్రభుత్వ లక్ష్యానికి ఇవి దోహదం చేస్తాయని చెప్పొచ్చు. ఐతే పెద్ద మొత్తం లో డిజిటల్ పేమెంట్స్ కాబట్టి అవతల వ్యక్తి యొక్క నెంబర్ కానీ డీటైల్స్ కానీ అన్నీ కరెక్ట్ గా ఉండేట్లు చూసుకోవాలి లేదంటే పొరపాటు జరిగే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా సరే చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.