తన మూత్రంతో తాను కంటిని శుభ్రం చేసుకున్న మహిళ, తర్వాత ఏం జరిగిందంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

ఇంటర్నెట్ వినియోగం కూడా విపరీతంగా పెరగడంతో దేశ విదేశాల్లో జరిగే సంఘటనలు క్షణాల్లోనే అందరికీ తెలిసిపోతున్నాయి. అంతేకాకుండా ఏదైనా విషయాలను కూడా ఎంతో స్పీడుగా తెలుసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీడియో రూపంలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే మహారాష్ట్రలోని పూణేకు చెందిన నూపుర్ పిట్టీ, తనను తాను ‘ఔషధ రహిత లైఫ్‌ కోచ్‌’గా చెప్పుకున్నది.

మూత్రంతో కళ్ళను కడుక్కోవడం, దాని వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి ఒక వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్‌ చేసింది. కాగా, ‘మూత్రంతో కళ్లు శుభ్రం.. ప్రకృతి సహజ ఔషధం’ అన్న పేరుతో వీడియో క్లిప్‌ను నూపుర్ పిట్టీ పోస్ట్‌ చేసింది. మూత్రంతో కళ్లు కడుక్కొనే విధానాన్ని ఆమె వివరించింది. ఉదయం నిద్ర లేచిన తర్వాత విసర్జించిన మూత్రాన్ని సేకరించాలని తెలిపింది.

చిన్న కప్పుల్లో ఉంచిన మూత్రంతో కళ్లు రెప్పలు వేయాలని, కళ్లలోకి మూత్రం వెళ్లిన తర్వాత అన్ని దిశల్లో తిప్పాలని చెప్పింది. అనంతరం మూసిన కళ్లపై అర చేతులు కొంతసేపు ఉంచి వెచ్చదనాన్ని ఆస్వాదించాలని పేర్కొంది. ఈ సందర్భంగా కళ్లను రుద్ద వద్దని ఆమె సూచించింది. ఇలా మూత్రంతో కళ్లు కడుక్కుంటే కంటి ఎరుపు, కళ్లు పొడిబారడం, ఐ ఇరిటేషన్‌ వంటి సమస్యల నుంచి సహజంగా ఉపశమనం పొందవచ్చని వెల్లడించింది.

మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. ‘దయచేసి మీ మూత్రాన్ని మీ కళ్ళలో పెట్టుకోకండి. మూత్రం స్టెరైల్ కాదు’ అని ఒకరు సూచించారు. ‘రసాయన వ్యర్థాలను శరీరం విడుదల చేయడం జీవ సంబంధమైన ప్రక్రియ. ఆ వ్యర్థాలను ఇలా ఉపయోగించడం హాని కలిగిస్తుందని ప్రజలు ఎందుకు అర్థం చేసుకోరు’ అని మరొకరు కామెంట్‌ చేశారు. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో ఈ వీడియో క్లిప్‌ను ఆ మహిళ డిలీట్‌ చేసింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *