వినియోగదారుల కోసం ‘డెలిగేటెడ్ పేమెంట్స్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా.. ఒక వ్యక్తి తన బ్యాంక్ ఖాతా నుండి యూపీఐ ద్వారా చెల్లింపు చేయడానికి మరొక వ్యక్తికి అధికారం ఇస్తుంది. అయితే ఆర్బీఐ ఈసారి కూడా రెపో రెట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. ఇలా రెపో రేటును మార్చకపోవడం ఇది 9వ సారి. గతేడాది ఫిబ్రవరి నుంచి కూడా కేంద్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులూ చేయడం లేదు. ఇక ద్రవ్యోల్బణం విషయానికి వస్తే ఏప్రిల్, మేలో స్థిరంగా ఉందని.. జూన్ నెలలో పెరిగిందని తెలిపారు. ఆహార పదార్థాల పెరుగుదలే దీనికి కారణమన్నారు. ఇక ఆర్బీఐ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.
ముఖ్యంగా ట్యాక్స్ టాక్స్ పేమెంట్లపై యూపీఐ లిమిట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుున్నారు. గతంలో రూ. లక్ష రూపాయలు ఉండే యూపీఐ లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచినట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అంటే ఇప్పుడు యూపీఐ ద్వారా ఒకేసారి రూ. లక్ష వరకూ చెల్లించవచ్చు. కేవలం కొద్ది గంటల్లోనే చెక్ క్లియరెన్స్‌కు చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ గవర్నర్ ప్రతిపాదించారు. పాత ఇంటి రుణంపై అదనపు రుణం తీసుకుంటున్న తీరుపై శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ట్యాక్స్ చెల్లించేవారు రూ.5 లక్షల వరకూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా యూపీఐతోనే చేయవచ్చు. దీనికి ఎలాంటి అదనపు చార్జీలు వేయరు.
చెల్లింపులు డెబిట్ లేదంటే క్రెడిట్ కార్డులతో చేస్తే మాత్రం కొంత చార్జీలు పడతాయి. ఆర్బీఐ ఇలా చార్జీలు పెంచడమనేది కొత్తేమీ కాదు.. గతంలోనూ పలు మార్లు పెంచింది. అంతకుముందు 2023 డిసెంబర్‌లోనే హాస్పిటల్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వంటి వాటికి చేసే యూపీఐ పేమెంట్ లిమిట్‌ను ఆర్బీఐ రూ. 5 లక్షలకు పెంచింది. ప్రస్తుతం పన్ను చెల్లింపుల పరిమితిని కూడా పెంచేసింది. సాధారణ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ విషయంలో మాత్రం మార్పేమీ చేయలేదు. అది గరిష్టంగా రూ. లక్ష మాత్రమే ఉంది. ఇక చెక్ క్లియరెన్స్ విషయంలోనూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు.
చెక్ క్లియరెన్స్ ప్రక్రియను తాత్సారం చేయవద్దని.. ఇది గంటల్లోనే పూర్తి కావాలని ప్రతిపాదించారు. నిరంతర చెక్ క్లియరెన్స్‌ను చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2 నుంచి 3 రోజుల వరకూ సమయం పడుతుందన్నారు. టాపప్ లోన్లు, బంగారు రుణాలను ఇవ్వడంలో ఆర్థిక సంస్థలు పెద్దగా నిబంధనలను పాటించడం లేదన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలు ఒకవైపు పెరుగుతుంటే.. బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు క్రెడిట్ డిమాండ్‌ను అందుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.