తులసి మొక్క.. దాదాపు ప్రతి భారతీయ ఇంట్లో దీనిని చూడవచ్చు. తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. దీనిని శ్రీ తులసి, విష్ణుప్రియ అని పిలుస్తారు. తులసి మొక్కకు సంబంధించిన అనేక నమ్మకాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అయితే తులసి మొక్క ఇలా కనిపిస్తే ఇంట్లోకి ధనం రానున్నందని అర్ధం అట.. ధనవంతులు అయ్యే సంకేతాలు హిందువుల ఇంట్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది.
రోజూ తులసి మొక్కకి పూజలను చేస్తారు. తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పుజిస్తారు. పూజలో లేదా శుభకార్యంలో ఇది అవసరం. అయితే మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కలో అకస్మాత్తుగా కొన్ని మార్పులు రావడం ప్రారంభిస్తే.. మీరు ధనవంతులు అయ్యే సంకేతం కనిపిస్తున్నారని అర్థం చేసుకోండి. పుష్పించే తులసి మొక్క వాస్తు శాస్త్రం ప్రకారం ధనవంతులు కావడానికి ముందు ఇంట్లో నాపెంచుకునే తులసి మొక్క కొన్ని శుభ సంకేతాలను ఇస్తుంది.

తులసి మొక్క అకస్మాత్తుగా పచ్చగా మారినా.. తులసి మొక్క పువ్వులు పెరగడం ప్రారంభించినా లేదా తులసి మొక్క మొగ్గలు ఎక్కువగా కనిపించడం ప్రారంభించినా.. త్వరలో మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఆదాయం పెరుగుతుందని.. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి అయినా డబ్బు వచ్చే అవకాశం ఉందని అర్ధం. అంతేకాదు మీరు అప్పుల నుంచి కూడా విముక్తి పొందనున్నారని తులసి మొక్కలో కనిపించే ఈ సంకేతాలకు అర్థం.
తులసిలో దర్భలు పెరగడం ఇంట్లో తులసి మొక్క దగ్గర లేదా తులసి కుండీలో దర్భ గడ్డి పెరగడం ప్రారంభిస్తే.. ఇది కూడా ధనవంతులు కావడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. దర్భ గణేశుడికి చాలా ప్రియమైనది. తులసి లక్ష్మీ దేవికి ప్రియమైనది. దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజించే సంప్రదాయం ఉంది. అటువంటి పరిస్థితిలో తులసి మొక్కలో దర్భలు పెరుగుతుండడం అంటే మీరు రాబోయే కాలంలో ధనవంతులు కాబోతున్నారని సూచిస్తుందట.