తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నేటికీ తిరుగులేని నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు త్రిష. ఆమె పని అయిపోందిరా అన్న దశ నుంచి ఇంకొన్నాళ్ల వరకు త్రిషకు ఢోకా లేదురా అనిపించుకుంటున్నారు. ఒకానొక దశలో ఆమె చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు. వయసు పైబడటం, కొత్త అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉండటంతో త్రిష లాంటి సీనియర్ హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీంతో త్రిష వ్యసనాలకు బానిసైందని కోలీవుడ్ టాక్. అయితే అటువంటి త్రిష తన ఇంటిని ఒక సీనియర్ స్టార్ హీరోకు అమ్మేసిందట.
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు సీనియర్ హీరో భాను చందర్. ప్రస్తుతం హీరోయిన్ త్రిష ఇంట్లో భాను చందర్ ఉంటున్నాడట. అసలు త్రిష భానుచందర్ కు ఇల్లు ఎందుకు అమ్మేసిందో తెలుసా..? కారణం ఏదై ఉండొచ్చు. అసలు ఆమెకు ఈ అవసరం ఎందుకు వచ్చిందనుకుంటున్నారు. అయితే త్రిష భానుచందర్ కు ఇల్లు అమ్మింది ఇప్పుడు కాదు.. ఎప్పుడో కెరీర్ బిగినింగ్ లో. అవును త్రిష తండ్రి భాను చందర్ కు ఈ ఇల్లు అమ్మారు. తెలుగు హీరో అయిన భాను చందర్ చెన్నైలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీ హైదరాబాదుకు షిఫ్ట్ అయినా కూడా కొందరు అక్కడ ఆస్తకులు కొనుకుని సెటిల్ అయిన వారు.. హైదరాబాద్ రాలేకపోయారు.
అలా చాలామంది నటీనటులు చెన్నైలోనే ఉండిపోయారు. శుభలేక సుధాకర్, భాను చందర్, ఎస్పీబీ, డబ్బింగ్ జానకీ, గొల్లపూడి, ఇలా చాలామంది చెన్నైలోనే ఉంటున్నారు. ఇక ప్రస్తుతం చెన్నైలో భాను చందర్ రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. తన ఇల్లు చూపిస్తూ.. తాను ఉంటున్న ఈ ఇల్లు.. స్టార్ హీరోయిన్ త్రిషది అని అన్నారు. త్రిష కెరీర్ బిగినింగ్ లో తన తండ్రి వ్యాపారానికి డబ్బులు తక్కువ అవ్వడంతో ఈ ఇల్లు భాను చందర్కు అమ్మేశారట. ఆ తర్వాత త్రిష ఇంటిని భాను చందర్ భార్య తమ టేస్ట్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుని అందంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది.
అందుకోసం వారు చాలా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. భాను చందర్ కు చెట్టు అంటే చాలా ఇష్టం. ఆయన సతీమనికి పూలు అంటే చాలా ఇష్టం.. అందకే ఇల్లంతా పూలమొక్కలతో పచ్చగా తయారు చేశారు. ఇక ఎప్పుడన్నా త్రిష కనిపిస్తే.. మా ఇల్లు ఎలా ఉంది? అని అడుగుతుందని ఇంటర్వ్యూలో భాను చందర్ చెప్పుకొచ్చారు. అలాగే గతంలో త్రిష బెడ్రూం, ఇప్పుడు తన బెడ్రూం అయిందని తెలిపారు. త్రిష ఇల్లు తమకు బాగా కలిసొచ్చిందని కూడా ఆయన అన్నారు. కాగా, భాను చందర్ కు త్రిష అమ్మేసిన ఇంటి విలువ ప్రస్తుతం రూ. 8 కోట్లు ఉంటుందని సమాచారం.