కెరీర్ బిగినింగ్ నుంచి త్రిష గురించి ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె గురించి సంచలన రూమర్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్ళైన స్టార్ హీరోతో త్రిష ఎఫైర్ పెట్టుకున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి రూమర్స్ మాత్రమే. కానీ ఈ రూమర్స్ కి బలం చేకూరుస్తూ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు దళపతి విజయ్. అయితే ‘వర్షం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి, స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది.
తన అందం, అభినయంతో ఒకానొక టైమ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ ను ఊపేసింది. సడన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చి, కొంతకాలం తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అయితే రీఎంట్రీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ అదరగొడుతుంది. అయితే కొన్నాళ్ళ నుంచి త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి మధ్య రిలేషన్ నడుస్తోంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలపై వీళ్ళిద్దరూ ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. కాగా త్రిష ఇప్పటి వరకు ఐటెం సాంగ్ ల జోలికి వెళ్లలేదు.
కానీ విజయ్ హీరోగా నటించిన ‘లియో’ సినిమాలో మాత్రం ఫస్ట్ టైం అలాంటి సాంగ్ లో నటించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోని తాజాగా మరోసారి త్రిష విజయ్ కలిసి ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
తాజాగా త్రిష, విజయ్ ఒక ప్రైవేట్ జెట్ లో కలిసి ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం ఆమె ప్రియుడితో జరిగిన సంగతి తెలిసిందే. కీర్తి పెళ్లి కోసమే వీళ్ళిద్దరూ కలిసి వెళ్తూ కెమెరా కంటికి చిక్కినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వీడియోని చూసిన చాలా మంది నెటిజన్లు నిజంగానే వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అంటూ కామెంట్శ చేస్తున్నారు. అందులో భాగంగానే ‘జస్టిస్ ఫర్ సంగీత’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
#BreakingNews
— Shiva Yaduvanshi (@Mr_ShivaYadav1) December 13, 2024
If they both are traveling together then what's the issue? If travelling only is the criteria to judge then it's very wrong. #JusticeforSangeetha pic.twitter.com/aiBi65HeLx