H1-B వీసా ‘అతి నైపుణ్యం కలిగిన’ కార్మికులు మాత్రమే అమెరికాకు వచ్చేలా చేయడం, అమెరికన్ల ఉద్యోగాలను రక్షించడం లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ఫ్ మాట్లాడుతూ.. H1B ప్రోగ్రామ్ ‘అత్యంత దుర్వినియోగం అవుతున్న వీసా వ్యవస్థలలో ఒకటి’ అని చెప్పుకొచ్చారు. అయితే తాజా 1-B వీసాపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత వీసాలకు, రెన్యువల్స్ కి తాజా ఫీజు పెంపు నిబంధన వర్తించదని వెల్లడించింది.
కొత్తగా వచ్చే ఏడాది నుంచి జారీ చేయనున్న వీసాలకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. 2025 లాటరీ వీసాలకు సైతం పాత ఫీజులే వర్తిస్తాయని వెల్లడించింది. అయితే కొత్తగా హెచ్1 బి వీసాకు దరఖాస్తు చేసుకునే వారు లక్ష డాలర్ల ఫీజు జీవిత కాలానికి ఒకసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని స్పష్ఠీకరించింది. ఇప్పటికే H-1B వీసాలు కలిగి ఉన్నవారు, ప్రస్తుతం US వెలుపల ఉన్నవారు తిరిగి ప్రవేశించడానికి ఫీజు వసూలు చేయమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్‌లో చేసిన ట్వీట్‌లో స్పష్టం చేశారు. ఇది వార్షిక రుసుము కాదు.

ఇది పిటిషన్‌కు మాత్రమే వర్తించే ఒకేసారి చెల్లించాల్సిన రుసుము. H-1B వీసా హోల్డర్లు ఎప్పటి మాదిరిగానే దేశం విడిచి వెళ్లి తిరిగి ప్రవేశించవచ్చు. వీరికి నిన్నటి ప్రకటన ఏవిధంగానూ ప్రభావితం చేయదు.. ఇది కొత్త వీసాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుత వీసాదారులకు, రెన్యువల్‌కు వర్తించదు. ఇది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది’ అని ఆమె తెలిపారు. ఇక H-1B దరఖాస్తులపై భారీగా పెంచిన ధరలు ఆదివారం (సెప్టెంబర్ 21) తెల్లవారుజామున 12:1 గంటల, ఆ తర్వాత నుంచి దాఖలు చేసే కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది.
ఇప్పటికే వీసా కలిగి ఉన్నవారికి ఇది వర్తించదు. అయితే శనివారం ట్రంప్ చేసిన ప్రకటనపై క్లారిటీలేకపోవడం వల్ల అనేకమందికి ఆందోళన కలిగించింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న H-1B కార్మికులు గడువుకు ముందే తిరిగి రాకపోతే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు, టెక్ కంపెనీలు హెచ్చరించాయి. తిరిగి ప్రవేశించడానికి కూడా లక్ష డాలర్ల రుసుము చెల్లించాలేమోనని చాలామంది భయపడ్డారు. అయితే, అది నిజం కాదని తాజాగా వైట్ హౌజ్ ఇచ్చిన ప్రకటనలో తేలిపోయింది.
దీంతో ప్రస్తుతం వీసా కలిగిన వారు ఊపిరిపిల్చుకున్నారు. కొత్త ఫీజు నిర్మాణం మొదట కొత్త దరఖాస్తుదారులకు రాబోయే H-1B లాటరీ సైకిల్‌కు వర్తిస్తుంది. ప్రస్తుత వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు కాదని ఓ అధికారి తెలిపారు. మరోవైపు తక్షణం యూఎస్‌కు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ మెయిళ్లు పంపుతున్న నేపథ్యంలో చెలరేగిన ఈ గందరగోళంపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
President Trump’s new H-1B visa requirement applies only to NEW, prospective petitions that have not yet been filed. ⁰⁰Petitions submitted prior to September 21, 2025 are not affected.https://t.co/YZmqtpE8N3 pic.twitter.com/ZwCnqeoLVI
— USCIS (@USCIS) September 20, 2025