ప్రయాణికులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలందించేందుకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే రన్నింగ్ ట్రైన్ లో నుంచి విలువైన వస్తువులు పడిపోతే టెన్షన్ పడాల్సిన అవసరంలేదని చెబుతున్నారు. అయితే RPF జవాన్ రైలు జనరల్ బోగీలో నిద్రిస్తున్న ప్రయాణీకుడి మొబైల్‌ను దొంగతనంగా తన జేబులోంచి తీస్తున్నట్లు కనిపిస్తుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సీటుపై నిద్రప్తున్న ప్రయాణీకుడికి తన సెల్ ఫోన్ ను ఎవరో తీసుకుంటున్నారు అన్న విషయాన్నీ కూడా గుర్తించలేదు. దీని తర్వాత పోలీసులు ఆ ప్రయాణీకుడిని నిద్రలేపి మీ ఫోన్ ఎక్కడ అని అడిగాడు. అప్పుడు ఆ ప్రయాణీకుడు తన ఫోన్ కోసం వెతకడం ప్రారంభించాడు. అప్పుడు ఆ పోలీసులు ఫోన్‌ను పై జేబులో పెట్టుకుని అంత గాఢంగా నిద్రపోవడం తన తప్పు అని చెప్పి, పోలీసు అతనికి ఫోన్ తిరిగి ఇచ్చాడు.
అదే సమయంలో రైల్వే పోలీసు ప్రయాణీకుడికి, రైలులో ఉన్న ఇతర ప్రయాణీకులందరికీ ఫోన్‌ను ఎల్లప్పుడూ ప్యాంటు జేబులో ఉంచుకోవాలని సలహా ఇచ్చాడు. ఇలా ఫ్యాంట్ జేబులో ఫోన్ ను పెట్టుకుంటే.. దొంగలు ఆ ఫోన్‌ను బయటకు తీయడం కష్టం.. పైగా మీకు ఆ విషయం తెలుస్తుంది కూడా…
అప్పుడు దొంగతనం జరిగే అవకాశం కూడా తగ్గుతుంది. @geetappoo హ్యాండిల్ నుంచి షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 88 వేలకు పైగా వీక్షించారు. దీనికి దాదాపు 2 వేల లైక్‌లు వచ్చాయి.
रात्रि समय में ट्रेन में ऐसे ही यात्रियों के सामान की चोरी होती है जिसका एक वीडियो बनाकर लोगों को जागरूक करते हुए रेलवे पुलिस… pic.twitter.com/jUICpLoJbO
— Geeta Patel (@geetappoo) July 8, 2025